పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

గిరిచరశ్రేణి లగ్గకెక్కిన దశాన
నాదితేయారి, డిగ్గంగ నడచియల్కఁ
జింత హరిజిత్ఖగారాతిఁ జేఱఁజీఱి
యని రచించంగ ననిచిన నతిశయిల్లె.

92


చ.

ఘనదశకంధరాజ్ఞ నతిగాఢనగాహితజిత్ఖగారి రా
నని రచియించ నర్కతనయాది హరిచ్ఛటలెల్లఁ దాటి చె
ట్లనచఁ, ద్రిశృంగగండశిలలన్ నలినేయఁగ దాళలేక చ
య్యన నిజరాజధానికి నయక్రియచేఁ దిరిగెన్ దృఢార్తియై.

93


క.

[1]తనకేలన్ దారానం
దనహరిచే దెగినయట్టి దానికి [2]గిరిశా
సనజిత్సురారి యరిజన
హననేష్టి రచించదలఁచి యనదృశగతిచేన్.

94


తే.

ఆహితజనయజ్ఞకారియై యలరి యజ్ఞ
యం దధికచిత్రజయశరాంగాస్త్రశక్తి
గాంచి, రాత్రించరశ్రేణి గణనఁ జేయ
హెచ్చ లయకాలచండచండీశలీల.

95


సీ.

చండకాండాసనజ్యాటంక్రియలచేత
             గణితనిస్సాణధంధణలచేత
యధికదైతేయరాజాహంక్రియలచేత
             [3]చరణసుకటఝంఝణల చేత
గంధగంధిలదంతిగణఘీంక్రియలచేత
             [4]ఘంటికాయతఘణఘణలచేత
కరహేతిసంఘాతకషఖంక్రియలచేత
             [5]ఘనరథచక్రగర్ఝరలచేత
కదలె హరిజి న్నిశాచరకర్త ధాక
హరిశిఖకృతాంతనైరృతశరధినాథ

  1. తనసేనల్
  2. గిరిశాసనజిచ్ఖగారి (ము)
  3. చరణకటకఝళఝళలచేత (శి)
  4. కలితనిస్సాణఘణంఘణలచేత (శి)
  5. ఈచరణము శి.గ. ప్రతిలో లేదు.