పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

హరి లంకకె లంఘించిన
[1]సరణి గణించంగ నేల చాఱల్ జెల్లల్
శరనిధి కీతల కాతల
యరయఁగ [2]నీదె ననరాదె యంగదకీశా![3]

88


వ.

అని తెగనాడిన దశాననఖచరారి గంధకరటిపై లంఘించిన కేసరి
చందాన నేగసి దశశిరఃకిరీటశ్రేణి సడల్చి, హాటకశాటికల్ చించి,
గాత్రకీలితాలంక్రియల్ జార్చి, యాస్థానదండనాయకనేతల ఖండించి,
ధనధాన్యశాలల్ చెల్లాచెదరఁ జేసి, లంకారాజధానిఁ గలంచి, తిరిగి,
(త్రిశృంగాద్రి) స్థలి నిల్చి, దాశరథికి సాష్టాంగదండక్రియ లాచరించి,
యాద్యంతక్రియ లెఱింగించె నక్కడ.

89


క.

అనతాంగదహరి కరతా
డనచర్యన్ గాత్రయష్టి డస్సి కలకచేఁ
దనసదనాంతస్స్థలికిన్
జని దశగళనిర్జరారి జడియఁగ నంతన్.

90


శా.

ఆలంకానగరీస్థలిన్ జనకకన్యాజాని యాజ్ఞారతిన్
జాలా సందడి నర్కజాతహరి రాజశ్రేణి శంకించ కే
సాలస్యందనఖేయదంతిశకటిశస్త్రాస్త్రశాటీనటీ
శాలాహాటకదీర్ఘకల్ చెరచి యిచ్చన్ గన్నదేగా గతిన్.

91
  1. (శి) లో లేదు... జెల్లెల్ (గ)
  2. నీదంగరాదె (శి)
  3. 88 పద్యము తరువాత 'శి' ప్రతిలోగల పద్యములు:
    వ. అదిగాక నాయంతఃకరణస్థితిం దెలియఁజేసెద.
    ఉ. కానఁగ నేరకే యలృతగాథ లికేటికి నాడ నక్కటా
        కానఁ జగజ్జనిత్రి తనకీర్తిన దెచ్చిన (యట్టి) జానకీ
        జాని కరాస్త్రధారఁ దెగి సద్గతి గాంచెదనన్న కాంక్షచే
        నే నిట నింతఁ జేసితి గ్రహించర నాతెఱఁగెల్ల చల్లఁగన్.
    క. జనకజ సాక్షాత్త్రిజగ
        జ్జననీయతి సాదరచరయా...
        యన.....