పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కాకచేఁ దాటకి ఖండించె నన నేల?
             నలినాతి నిర్జించినాఁ డ దెంత!
హరిశరాసనయష్టి హరియించె నన నేల?
             [1]యలకట్టె గండ్రించినాఁ డ దెంత!
క్షత్రియారి కడంక సడలించె నననేల?
             నల యగ్రజుని గెల్చినాఁ డ దెంత!
తాటకేయ[2]ఖరారి దండించె నననేల?
             [3]యల నిఱ్ఱి శాసించినాఁ డ దెంత!
యహహ! నీరథి గట్టించె ననఁగ నేల?
నీళ్లకడ జేసినట్టి యానీ ట దెంత!
తాననఁద నెంత నేనెంత ధరణిజాని
గీటడంచెదరా కీశకీటకేశ!

84


క.

ఖరరాక్షసకర్తన్ సం
గరధాత్రి జయించెఁ దాటకాహంత యటం
[4]చరయం గూకలు జేసెద
చిరకాలశరీరధారిఁ జెండిన దెచ్చే!

85


క.

చెట్టందె దాగి, శాక్రిన్
నెట్టన శితశస్త్రిఁ ద్రెళ్లనేసిన యది యే
కట్టడ? క్షితిధరచారిన్
[5]గిట్టించిననింద గాక కీర్తి కలిగెనే?

86


క.

తెలియంగ లంక చండా
నలకీలల నగ్గజేసినాఁ డని హరి ని
చ్చల గణియించఁగ నేలా
[6]యెలుకలఁ జర్చించరాదె యీలాటితరిన్.

87
  1. నలికట్టె నిర్జించె నాతఁడెంత? (శి) నాడదెంత? బదులు నాతఁ డెంత? (శి)
  2. ఖగారి (శి)
  3. నలినర్థి (ము)
  4. అరయక గణనల్ చేసెద
  5. గెట్టించిన నిందగాక కీర్తి గలిగెనే (ము)
  6. యలికల యర్చించరాదె యింటింటకడన్ (శి)