పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

నరనాగత్రిదశక్షితీశతతి దైన్యగ్లాని నేతెంచి కిం
కరలీలన్ జరియించి, చిత్రహయనాగశ్రేష్ఠగాంగేయర
త్నరథాలంకృతతారహారధనధాన్యశ్రీల రంజిల్లఁగా
సరిగా నాతని నెన్న నేల నహహా! చాలించరా యంగదా!

78


క.

[1]తనకట నేనఁట శరణని
యననఁట సీతఁ దనకడకు ననిచెదనట తా
ననిచిన నిజనగరికి హా
చనునట యీరీతి యెందు జరుగంగలదే!

79


క.

గట్లకడన్ నిల్కడలై
చెట్లంగల కాయలెల్ల చెడదీని యాహా
[2]కాట్లాడెడి హరిఘటల ని
కెట్లన్నరకీటనిరతి నేతెంచిరిరన్.

80


ఉ.

ఎన్నికచే నగస్త్య జటిలేశిత తా నరచేత దాల్చి యా
[3]కన్నిధి ద్రాగినట్ల, ఘటకర్ణనిశాచరకర్తకేచ, నా
యన్నరకీటకాగ్రణి సహాయత, నానగచారిరాజి న
చ్ఛిన్నగతిన్ హరించి కడజేసి, తినంగల డేల యంగదా!

81


ఆ.

తల్లి దండ్రి కెడసి, దాయాదిసంతతి
కెడసి, గహనఛాత్రి కేఁగినట్టి,
తా ననంగ నెంత, తాటకేయారి న
న్నేల రేచి యాడ నేరఁగలఁడె!

82


చ.

అనత కరీంద్రసైనికశతాంగహయస్థితి లేక, చండసా
ధనగతి లేక, దాయి తనదండయి రా, నలి నంఘ్రిచారియై
యని రచియించ నేఁగెనఁట, యానరకీటకకర్త కట్టయా
తనిసిరి నాజయక్రియ, నిదర్శనసిద్ధిగ గాంచి యాడరా!

83
  1. ఈపద్యము కొంత శిథిలమగుటచే పూర్తిగావించితి (ము) ఇట్లు లేఖనకర్త.
  2. కొట్లాడెడి
  3. కంనిధి: సముద్రము