పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

[1]శతధృతిచే నద్రిజాజానిచే చిత్త
             కాంక్షితార్ధస్థితి గాంచికాంచి
అష్టదిక్కర్తలనైన దృష్టికిఁ దేని
             నందనసంసిద్ధిఁ జెంది చెంది
అగణిత[2]రత్నాకరాంతరస్థలరాజ
             ధాని సంఘటిలంగఁ దనరితనరి
గంధనాగశతాంగకంఖాణసైనిక
             శ్రేణి రంజిల్లంగఁ జెలఁగి చెలఁగి
[3]అంచితస్థితిశ్రీలచే నతిశయిల్ల
లెస్సగా [4]సంచరించంగ లేక లేక
నిఖిలహితరాక్షసేశితల్ నిందఁ జేయ
జెడఁగ రరిగాఁగ సీతఁ దెచ్చితి దశాస్య!

55


క.

శ్రీనిధి ధరణీకన్యా
జానినడక నిఖిలదిశల సరిదాకఁగ [5]
జ్ఞానిగతిన్ నన్నడగం
గా నేటికి కైకసేయఖచరారాతీ!

56


చ.

జలనిధి నేయఁదాలిచిన చండశరాసనశస్త్రధారచే
నలయలకాధినాయక దిగంతఘనత్రిదశారి రాజితే
ఖలతృణలీల నర్థిఘటికం దెగటార్చిన [6]కోసలేశ స
ల్లలితకథాచ్ఛటల్ దెలియ లజ్జ ఘటిల్లదె రాక్షసాగ్రణీ.

57


క.

రాక్షససంతతి నెల్లన్
శిక్షించఁగ సకలదిశల శిష్టజనాళిన్
రక్షించగ శ్రీహరి దా
నీక్షితి జనియించె జానకీశాకృతిచేన్.

58


ఉ.

చాలదిగేశితల్ సకలచర్యల నర్చనచేయ నన్నిటన్
జాలినయట్టి నన్నధికసాహసభక్తి గ్రహించి తెచ్చి

  1. శరధృతి (గ) కానిపాఠము సరసముగాలేదు.
  2. రత్నాకరాంతర (శి)
  3. అంచితశ్రీలీలచే చాల నతిశయిల్లి (శి)
  4. సంచలించంగ లేక కాక (శి)
  5. అజ్ఞానగతిం నన్నడగంగా నేటికి (శి)
  6. చక్రహస్త (వ్రా) శాకలేశ (ము)