పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చిన దైత్యహంత యానతి
[1]ఘనతరక్రియఁ దాల్చి దిశల కరఁగిరి సరగన్.

32


క.

తతచక్రనదాంతరసం
స్థితధరణీశిఖరిఘటలఁ దెచ్చిన జలధిన్
ధృతిసంధిల [2]గట్టె నల
క్షితిధరచరనేత సాటి సేయఁగ గలరే.

33


శా.

ఆలంకాస్థలిఁదాక కంధినయచర్యం [3]గట్లగట్టించి తా
హాళిన్ రాక్షసహంత సద్గిరిచరాధ్యక్షచ్ఛటాసంగతిన్
జాలారాత్రిచరేశితల్ కలఁకచేఁ జల్లించఁగా నింగి జే
జేలెల్లన్ గణియించఁగా నడచె నక్షీణక్రియల్ దీరఁగాన్.

34


ఆ.

ఇట్టి సరణి గట్లకట్టదారి నిశాచ
రారి యర్కనందనాదికీశ
[4]ఘటల నెనసి శీఘ్రగతినంతనే, త్రిశృం
గాద్రి నెక్కి నిలచె హర్షశక్తి.

35


వ.

అంతట నసంఖ్యలైన హరిసేనలచేత త్రిశృంగగిరి నిలిచి దాశరథి గంధ
గజకంఖాణశతాంగశాలలచేతఁ గింజల్కరంజితకంజాతసంజాతరసా
క్రాంతకాసారతటాకదీర్ఘికలచేత సకలధరణిజలతాంతరసస్థగిత
దిగంతశృంగారకాంతారరేఖలచేత గాంగేయసాలహీరకలశకేతనాయత్త
రాజసదనఘటలచేతఁ జెంగలించి రత్నచ్ఛాయల నాకాశసరణి నలంక
రించెడి లంకానగరి దర్శించి, గణించి తలఁగదిలించెడి యారాజహేళిం
గైకసీకనిష్ఠనిశాచరనేత చేరంజని.

36


ఆ.

అనఘ లంకచిహ్న లరసితి నాచెంత
కైకసేయదితిజకర్త నిఖిల
హితనిశాటనేత లెంచ నాస్థానియై
తనరెఁ గాన నతని గనఁగరాదె.

37
  1. అనతిక్రియ (గ)
  2. గట్టిరల (శి)
  3. గట్టగట్టించి
  4. ఘటల నెనసి లంక గదియంగ జనియె శృంగాద్రి యెక్కి నిలిచె హర్షశక్తి (శి)