పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అకట నిశాచరాగ్రణి! దశాస్య! జగజ్జనయిత్రి రాజక
వ్యక నిట కేల తెచ్చితి రయక్రియ సంధిలఁ దెచ్చినట్టిదా
నికి నఘచింతచేఁ జెనక నేర్చెద, నేరఁగ రాదె ధాత్రిఁ గీ
లికిఁ జెద లంటురానిసరళిం దిలకించఁగ లెస్స యన్నిఁటన్.

9


చ.

శరధిఁ దృణాకృతిం దెగడి, చంగన చంగన దాటి సీత తీ
రరసి, యగచ్ఛటం దిరిగి, యక్షనిశాచరకర్తఁ జీఱిఁ య
క్షరతరశక్తి లంక శిఖికాక దహించి తరించినట్టి యా
హరి గనియైన సీతతెఱఁ గారయరాదె నిశాటశేఖరా!

10


సీ.

నీచేతఁ గదలని నీలకంధరుశరా
             సనయష్టిఁ దృణలీల గినియఁజేసె
నఖిలరాజశ్రేణి నణఁగఁగఁ దాచిన
             యగ్రజాగ్రణిశక్తి నిగ్రహించె
కంఠి లంఘించి లంక దహించి తిరిగిన
             హరికర్త నేలన నతని నేలె
రెల్లగట్టెక్కిన దిట్ట ని న్దెచ్చిన
             యాశాక్రి నేకాస్త్రహతి హరించె
ఖచరసంతతి యంతంత గణనఁజేయఁ
దాడిచెట్లెల్లఁ ద్రెళ్లంగఁ దఱిగినట్టి
దాశరథికి ధరాంగనాతనయ నిచ్చి
శర ణనిన నన్నిటన్ లెన్స చారణారి!

11


తే.

గణన జెక్కిన యాకారకళలచేతఁ
జక్కనై నట్టికన్నియల్ చాల గలఁగ
సీతఁ దేనేల యందఱఁ జెరచనేల
లంకఁ జెడ నేలఁ లేని కళంక యేల.

12


ఉ.

ఆతతశక్తి సంధిల రణాంగనధాత్రి నఖండరాక్షసా
రాతి హరీంద్రసారకరరాజితదీర్ఘ[1]కరాసనాంతని

  1. శరాసనార్త (ము) శరాసనాంత (శి)