పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యాడంగ నట్టిజాడల
నీడేరెనె, కార్యసిద్ధు లిద్దచరిత్రా!

4


చ.

అలజడిఁ [1]జేసి శక్రదహనార్కజనైరృతకంధినాయకా
నిలధనదాంగజాద్యఖలనిర్జరకిన్నరసిద్ధసంతతిన్
గలన జయించినట్టి త్రిజగజ్జనరక్షణకర్త కాంచనా
చలధృతిశాలి చండతర[2]సాహసియైనఖరారి యన్నిటన్.

5


క.

సిరియే జానకి యయ్యెన్
హరియే దాశరథి యయ్యె నదిగాక నిశా
చరనాథ! త్రిదశఘటలే
గిరిచరకర్త లయి రిలను గీడాడంగన్.

6


సీ.

శృంగారకాననక్షితిజాతసంతతి
             యంతటఁ ద్రెళ్లిన ట్లాయెనేని
శిలలచే ఘనరజశ్శ్రేణిచేత నగడ్త
             లర్థి ధాత్రికి [3]చదు నాయెనేని
కేతనాయత్తగాంగేయరాజగృహాళి
             యక్కడక్కడ దిన్నె లాయెనేని
గంధగంధిలదంతికంఖాణరథరాజి
             యడరి చెల్లాచెద ర్లాయెనేని
యరయ నంగళ్ల ధనధాన్యహారణార్థ
హారసంహతి నలిగాసి యాయెనేని
నిలిచి నేనాడినట్టి యానీతిసరణి
యెదకె దృష్టాంతగతిగాదె యదితిజారి.

7


క.

ధరణీకన్యానాయక
చిరతరశితసాయకాగ్నిశిఖ దేర్చి నిశా
చరగహనస్థలియట్లై
సరఁగనె యార్చినది లెస్సజాగిక నేలా?

8
  1. చేసె (శి)
  2. సాహసితమై
  3. చెద (ము)