పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆహారనిద్ర లెఱుఁగక
యాహాకారగతిచేత నాశలు గలఁగన్
ఆహరిసేనల్ దిరిగిరి
సాహసదృఢనీతి ధైర్యచర్యలచేతన్.

123


క.

అలయికచే నీరీతిం
దెలియక నల్దిశలఁ గలయఁ దిరిగి తిరిగి తృ
ష్ణలచే [1]నాకండ్లెంతే
నలజడి సేయంగ నిలిచి రార్తిక్రియలన్.

124


వ.

అంత.

125


సీ.

అంజనానందనహరికర్త సంగడి
             కాండ్లనందఱి జతగలసి చెంత
సలిలాండజాతసంజాతయాతాయాత
             కందరాంతస్స్ధలి గదిసిసాగఁ
గడలేని గాఢాంధకారసంహతిఁ దాటి
             నిశ్చేతనక్రియ నెగడినట్టి
రత్నసాలహిరణ్యరాజిగేహాంగణరం
             జితరాజధాని దర్శించి యచటఁ
జక్కనినెలంతఁ గని యట్టిచానకతన
దృష్ణ యాకండ్ల నడఁగించి దేజరిల్లి
యది గడచి ఢాక నెగసి యింద్రాద్రిఁ జేరి
సంచరించిరి [2]యంతంత జగతి యగల.

126


వ.

ఇట్లు సంచరించి యలయిక నందఱల్ జంగిలిగట్టి దాశరథి
కథ లిష్టగాథల నాడసాగి రెట్లంటేని.

127


సీ.

జనయిత్రియాజ్ఞ దాశరథి దండకకాన
             నాంతరస్థలికి దా నరుఁగ నేల?

  1. ఆకళ్లచే
  2. యంతట జగతిగలయ (వ్రా)