పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అయ్యెడ నాషాఢాదిదినచర్యల్ నడచె నయ్యెడ.

101


క.

క్షితి గగనస్థలి యేకా
కృతి దాల్చినయట్టిజాడ దృఢదంతికర
స్థితి నంచితజలధారా
తతి జారెన్ జలదగర్జితక్రియ లెసఁగన్.

102


మ.

కరచాచ్ఛిన్నదిగంతశాఖియయి నిర్ఘాతాహతా[1]గారయై
హరినాగేంద్రకరాతిచండశతధారాశ్లేషశేషాహిశే
ఖరగండస్థలియై ఘనాఘనతటిద్గర్జాతిరేకస్థితిన్
ధరయెల్లం జడి నిండసాగె జనచింతాకారణస్థానియై.

103


తే.

అట్టిజడినాళ్ల నాదైత్యహంతచింతఁ
గైకసీజనకాగ్రజాఖ్యాకశిఖరి
నర్థి నిల్చెను నధికహితార్తిచేతఁ
దాళఁజాలక తనచిన్నదాయిఁ జేరి.

104


క.

చేసిన [2]శరతికి రాకే
యాసారసహితజహరి యహంక్రియచేతన్
నాసాలసనాహృత్స్థలిఁ
గాసిలఁ జేయంతసాగెఁగా నిర్దయతన్.

105


క.

తేలిన తనకార్యస్థితి
లీలన్ ఘటియించె గనుక లెక్కించక తాఁ
జాలానాళ్లయ్యెన్ రాఁ
డేలా నే నింక నార్కి కేలా తెలియన్.

106


క.

తన రాజ్యశ్రీచేతన్
దనసాహసచర్యచేతఁ దారాస్థితికిం
దనదేహయష్టిఁ దెలియక
సనయత నేతేరడాయెఁ జంచలదృష్టిన్.

107
  1. గాళియై (ము) (హతాంగాళియై!)
  2. శరతి = శరత్కాలార్థము