పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

చేరి దినేశజాతహరిఁ జీఱిన [1]నంతట నాలకించి నిం
డారిన యాగ్రహాగ్నశిఖ లాశల నిండఁగ దాక నేఁగి శై
లారిజకీశనేత గదియన్ గఠినక్రియ నాజియయ్యె నా
చారణసిద్ధసాధ్యఖగచారణసంతతి తల్లడిల్లఁగన్.

94


క.

సాలాసాలి శిలాశిలి
తాళాతాళిం గరాశదంతాదంతిన్
శైలాశైలి కచాకచి
హేళిం గలయించసాగి రిద్దఱ లంతన్.

95


చ.

చని ఖరహంత చెంతఁగల శాఖయె యండగ నిల్చి సాయకా
సన దృఢశింజినిన్ గఠినశస్త్రికఁ జేరిచి లేఖరాజనం
దనహరిఁ గాంచికాంచి ధర తల్లడిలంగ ఝలీనదాక నే
సినఁ దెగి త్రెళ్లె దా నశనిచే నలియైన ధరాధరాకృతిన్.

96


క.

ఈరీతి శాక్రి ద్రెళ్లిన
దారాసతి నార్కి కిచ్చి దయచేఁ గిష్కిం
ధారాజ్యకర్తఁ జేసెన్
శ్రీ రంజిల నతనిగణన సేయంగలరే!

97


వ.

అంత.

98


శా.

తారాకాంత దినేశజాతహరి నిత్యశ్రీల శృంగారకాం
తారాజ్యస్థలిఁ జందనాచలదరీధాత్రీఘనహ్రాదినీ
తీరాగ్రక్షితిరాజగేయగుహలన్ దీరాన హృజ్ఞాతకే
ళీరాగస్థితి దేలియాడిరి హితాళీజాలసంక్రాంతిచేన్.

99


క.

ఏతఱిఁ దెలియఁగ నేరక
యాతారాకాంతఁ గాంచి యత్యంచితరా
జ్యాతిశయశ్రీచైతన్
సీతాజానిఁ గనలేక క్షితిఁ జరియించన్.

100
  1. రంతట (ము)