పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5 వేంకటరాఘవాచార్యులు :- రంగనాయకమ్మ భావనాచార్యుల పుత్రుడు - ప్రౌఢకవి. 'కేశవస్వామిశతకము' (అంత్యప్రాస), 'క్షమావింశతి' యను రెండు రచనలు లభ్యమైనవి. శతకరచనాకాలము శ.సం. 1778. (క్రీ.శ. 1853) దొరికిన యీ రెండురచనలును అత్యుత్తమముగా గలవు. పైరచనాకాలమునుబట్టి శతాబ్దముక్రింద యున్నట్లు తెలియుచున్నది. ‘ కేశవస్వామి భాస్వత్ఖగేశగామి' యనుమకుటముగల ఈశతకము కొంతకాలము క్రితము వరంగల్లు నుండి వెలువడుచుండిన 'ఆంధ్రాభ్యుదయము' అను పత్రికలో 'క్షమావింశతి'తోగూడ ప్రచురింపబడినదట. ఇటివల (1964లో) ఈ కవిప్రపౌత్రులైన మరింగంటి వేంకటరామానుజాచార్యులవారు (మొఖాసా కలువపూడి) క్షమావింశతితో శతకమునుముద్రించినారు.[1] మావద్దగల వ్రాతప్రతితోచూచిన ముద్రితప్రతిలో పాఠభేదములేగాక పొరపాట్లు హెచ్చుగానున్నట్లు తోచుచున్నది. ఈ వేంకటరాఘవాచార్యుల యనుజుడు —

6. (ద్వితీయ) వెంకట నరసింహాచార్యులు:- ఈయన 'తాలాంకనందినీపరిణయ' మను ఆరాశ్వాసముల ప్రౌఢప్రబంధమును 'ఇందిరాల భాగవత'మను యక్షగానమును రచించినాడు. తాలాంకుడనగా బలరాముడు. ఆయన బిడ్డయైన శశిరేఖను అభిమన్యుడు వివాహమాడుట యిందలికథ. మేనరికపు వివాహములపద్ధతి యిందు చక్కగా గలదు. ఆరాశ్వాసములతో గూడిన యీప్రబంధమును పై యక్షగానమును లక్ష్మణరాయ పరిశోధకమండలిలో నుండెడివని గో.క. సం. వలన తెలియుచున్నది. మావద్ద అటనట అసమగ్రముగా నున్న తా.నం. పతాళపత్రప్రతి లిఖతప్రతులును గలవు. ఇందలి గద్యపద్యసంఖ్య (లభించినంతవరకు) 1736. ఆదిరాజువా రీగ్రంథమును గూర్చిన విపులవ్యాసమును చాలకాలము క్రితము వ్రాసినారు[2]. ఆశ్వాసాంత్యములయందు 'ఆముక్తమాల్యద'వలె పద్యములు గలవు. అము

  1. చూ. మరింగంటి రాఘవాచార్యులు - కేశవస్వామిశతకము ( శ్రీభారతి 1966 డిసెంబర్) ఈ వ్యాసము ప్రచురణమైన నాటికి - శతకము ముద్రణమైనట్లు నాకు తెలియదు. ఇటీవల నాకొకప్రతి వీరు పంపించినారు.
  2. "తెలంగాణ" పత్రిక (సం. 4. సంచికలు 44, 50. వ్యయ-వైశాఖ బ. దశమి. 2–7-1946)