పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆయిఱ్ఱి దిశలు నిండఁగ
హా! యహిరాడంశ[1]జస్థరాజాగ్రణి! యన నా
ఛాయన్ దశరథనందన
[2]నాయిక యాలించి యార్తి నలినలిసేయన్.

46


ఉ.

అన్నలినాయతాక్షి తనయండఁ జరించెడి దిట్టఁ గాంచి, నీ
యన్న ఖరారి చండగహనాండజసంతతి సంచలించఁగా
ని న్నధికార్తిచే దలఁచే నెట్టన నాతని కిట్టి జాడయే
చెన్నటిజేసినా డరయ శీఘ్రగతిం జనరయ్య! యియ్యెడన్.

47


ఆ.

అనఁగ దరలనట్టియారాచనెలఁ గాంచి
యాడరాని జాడ యాడె గాన
జలజనయన హర్షసరణి రక్షగఁ జేసి
దైత్యహంతదారిదాయి చనఁగ.

48


వ.

అంతనిట దశకంఠలేఖారి [3]చదుర యగ్రజక్రియ నేతెంచి నిజలీల దెలియఁ
జేసిన.

49


చ.

జనకజ యాతగాని గని జాలి ఘటిల్లఁగ నేలజారినన్
గనికని నేలగడ్డఁగరకాండ దృఢక్రియ సంగ్రహించి కాం
చనరథధాత్రి జేర్చియతిసాహసచర్యల లంకజాడగా
జనియె నిశాటకర్త నరచారణనాగఘటల్ చలించఁగన్.

50


క.

ఈరీతి జనిన దినకర
సారథిజాతఖగనేత జాలిన దితిజా
తారాతి నడ్డగించఁగ
చారనఁగరదండశక్తి దాని హరించెన్.

51


ఆ.

దాని ద్రెళ్ల నడఁచి దశకంధరాదితే
యారి లంకఁ జేరనరిగి సకల
హితనిశాటనేతలెల్ల నిరీక్షించి
యర్థిగణన సేయ నలరె నంత.

52
  1. జాస్థరాగ్రణి (ము)
  2. నాయకి (ము)
  3. జదర (ము)