పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

కైకయీనందననృనేత గాంచి, రాక్ష
సారి యత్యంతహితశక్తి నాదరించి
తిరిగి సాకేతనగరికి సకల
సంరక్ష సేయంగ రాదె యనఘ.

151


క.

అనినట్టి దైత్యహంతం
గని దృగ్జలజాతనికరకణ నేచిన సా
హననస్థలియై యతిదై
వ్యనినాదక్రియ ఘటిల్ల నాడెం దెలియన్.

152


ఉ.

ఏల శతాంగకాండతతి? యేల యలంక్రియ? లేల రత్నశా
టీలలనాఘనాఘననటీనటచేటిక? లేల చంద్రకాం
తాలయగంధసారసరసాన్నహితస్థితి యట్టిజాడ నీ
[1]శ్రీలలితాంఘ్రియర్చనయె చెల్లదె నిర్జరశాఖి యన్నిటన్.

153


క.

ని న్నరఘడియందైనను
నన్నా! దర్శించలేక యాగంగలనే
యన్న దయఁ దాయిఁ గౌఁగిటఁ
దిన్నంగా చేర్చియాడెఁ దెల్లడి గాఁగన్.

154


ఉ.

ఎంచఁగ దండ్రి రాజననికిచ్చిన సత్యగరిష్ఠనిష్ఠ జె
ల్లించఁగ దీక్ష దాలిచితి లేక తిరస్క్రియ జారనాడినన్
గాంచిన యందఱల్ నగరె, కల్గిన కీర్తి యడంగదే నిదా
నించఁగ నర్కసంతతికి నిష్ఠ ఘటిల్లదె రాజనందనా.

155


ఆ.

ఇన్నియేండ్లచెంత నేల నీవాట
నిట్టిల్నసరణి నిట్టి[2]ఘటిక
దిరిగి చనఁగ గల సతిసహాయతచేత
నడ్డగించనేర యనఘచరిత!

156
  1. శ్రీలలి.... లె.... చాలును (ము)
  2. ఘనత