పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని తనకెంగేలిశరా
సనయష్టి నరేంద్రహంత జనకక్షితిరా
ట్తనయాజానికి నంది
చ్చిన దాలిచి యెక్కిడన్ సచిత్రగతిఁ గనన్.

112


క.

తిన్నఁగా గేల శింజని దీఁడితీఁడి
యధికటాంకారనాదక్రియలు సెలంగ
నశవి కెనయైనయట్టి యల్లంటఁ దాల్చి
నగి యనాయాసగతిచేతఁ దిగిచి తిగిచి.

113


క.

నీచే నీశస్త్రిక '[1]యిం
తై చనఁగా నేర డదితిజాళి కలంగన్
నీచరణక్షతి చేసెద
గాచిన నా కింక నింద గాదే యనినన్.

114


ఆ.

ఆర్తిచేత నగ్రజాగ్రణి దశరథ
తనయధరణిజానిఁ గని కలంగి
'చేరి తీర్థయాత్ర జేయంగ గా ళ్లిచ్చి
యనచ లెస్సగాదె' యనఘచరిత!

115


మ.

సకలజ్యాచరఖేచరాళి గణియించన్ నింగికిం జిక్కి క్రిం
దికి రానేగఁగఁ గాండసంఘటనఁ దంతెల్ గట్టితిం గాన న
త్యకలంకారత శస్త్రిచేత నది యాహా త్రెళ్లనేయంగఁ గీ
ర్తికథల్ నల్దిశలందు నిండెడి దయాదృష్టిం గటాక్షించరే.

116


క.

అన నాలకించి దశరథ
తనయాగ్రణి శస్త్రినట్టి తంతెల్ తెగనే
సిన, ధరణిం ద్రెళ్లె నిశా
జననాయకగణన లెంత సందడి నిండెన్.

117


క.

తనకట్టినట్టితంతెల్
మనశితశతధార ద్రెళ్లఁగా నేసిన న

  1. కణిన్ రై చనఁగా (ము)