పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

దాశరథికి సీతఁ దక్కిన నందన
త్రయికి సహజధరణితలనరేంద్ర
కన్యలన్ గళాతిధన్యల నిచ్చె నా
జనకరాజహేళి సంతసిలఁగ.

81


వ.

ఇక్కరణిఁ గల్యాణస్థితియైన చెంగట శతాంగసారంగకంఖాణదాస
దాసీహాటకశాటికారత్నరత్నాలంక్రియల్ [1]ననయగతిఁ దనయ నిచ్చి,
తనయల ననిచినం దశరథనేత నందనసహాయత సాకేతరాజధానికిం
దిరిగి చనియెడునెడ.

82


సీ.

సేనానిగల శిఖాళీనేతసన్నిధి
             నఖిలశాస్త్రక్రియ లబ్ధి నేర్చె
దిననాథసంతతి [2]జననాథసంతతి
             హరికి సాధన ధార గలయనరికె
నార్తసజ్జనరక్షకై ఖలశిక్షకై
             కంధికన్యాజాని కళ జనించె
చక్రాచలాంతస్స్థజగతి నగ్రజరాజి
             కరసి నిరాంతక సరణి నిచ్చె


తే.

జనకశాసనధారియై జనని గాంచి
నిశ్చలాగ్రహశక్తిచే నిగ్రహించె
నట్టి క్షత్రియహంత దిగంతరాజ
గణన లెచ్చంగ నేతెంచె గాఢచర్య.

83


క.

[3]అనతాగ్రహకీలిశిఖా
కనదాకృతిఁ గదలినట్టి క్షత్రియహంతన్
గని సకలరాజసంతతి
జనితార్తిం గదిలె నల్దిశల్ నిండంగన్.

84


చ.

అలజడిచేత నల్దిశల [4]కందరదాటుగ జారినంతనే
తలకని దండి నాదశరథక్షితి[5]రక్షితృహేళి కన్న రా

  1. ననయు (ము)
  2. శి.గలోలేదు
  3. అనలాగ్రహ (శి)
  4. కందరలాటగ (ము)
  5. వాయకహేళి (శి. గ) నాయక (శి. గ)