పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

నానాదేశనరేశితల్ సకలయత్నశ్రీల గాంగేయశా
టీనాగేంద్రహారీంద్రజాలనటచేటీనాటకశ్రేణి క
న్నానంగా కని డగ్గరం జెలంగు నాయాజిన్ నిరీక్షించి ధా
త్రీనాకాలయనేత లిట్లనిరి యర్థిన్ దేనియల్ జారఁగన్.

76


సీ.

ఆకాశకషణదీర్ఘాకృతి నేతేరు
             దిట్టతాటకఁ గెల్చినట్టి సరణి
యఖిలయత్నక్రియ లలరిన జటియష్టి
             నర్థి రక్షించిన యట్టిజాడ
యైంద్రాదిసకలశస్త్రాస్త్రసాధనశ క్తి
             నాశ్చర్యగతి గాంచినట్టి ఘనత
యంధకారాతిశరాసనదృఢయష్టి
             నర్థి గండ్రించినయట్టి దారి
యజతనయరాజహేళి కత్యంత చర్య
[1]నెఱుఁగఁజేసిన నగ్రజాధీశఘటల
కంచితాలంక్రియాదంతిహయశతాంగ
చేల సంసిద్ధఁ దనరించెఁ జాలనంత.

77


మ.

సకలశ్రీనిధియైన యాదశరథజ్యాకర్త తాఁ జక్రశ్రం
ఖకళాజాతనరాధినాథకరిసాంగత్యక్రియన్ నిస్సహా
నకసంజాతధణంధణల్ దిశల నిండన్ జేరఁగానేగె న
త్యకలంకస్థితి సంధిలన్ జనకరాడ్ధానిన్ సదానందియై.

78


క.

జనకనరనేత దశరథ
జనరాణ్ణిధిరాక నెఱిఁగి సహితస్థితిఁ జ
క్క నెదిర్చి కలసి దగిన
ట్టి నగళ్లన్ నించె సంగడీ లెన్నంగన్.

79


వ.

అంత.

80
  1. నెరుక (ము)