పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

కేల ధరించి దాశరథి క్రీడ గిరీశ శరాసయష్టి యా
శాలలనాదిలేఖఖగసాధ్యనిశాచరసారణాహియ
క్షాళి గణించ నెక్కిడి నయక్రియ చే దిగియంగ సాగినన్
జాలఁగ గండ్రలై ధరణి జారె జగత్త్రయి సంచలించఁగన్.

66


వ.

అంత.

67


సీ.

అచలాదితేయానలాచ్ఛకీలల [1]గంధి
             నగరాజె చిట్లికళ్లెగ ననఁగ
హరిదంత దంతి సంహతి యాగ్రహస్థితి
             జేరిక ఘీంక్రియల్ చేసె ననఁగ
నలినసంజాతాండకలశి యిట్టి ట్టయి
             యడలి చెల్లా[2]చెదరయ్యె ననఁగ
గగననిర్గళితనిర్ఘాతసంతతి చాలఁ
             దెగి ధాత్రిఁ గలయంగఁ ద్రెళ్లెననఁగ
దశరథక్షితినాథనందనకరాగ్ర
ఘటితగిరిశశరాసనగాఢయష్టి
దీర్ఘశింజిని తెగియంగఁ దిగిచినంతఁ
గఠిననాదాతిశయశీల గండ్రలయ్యె.

68


శా.

నింగి న్నల్దిశలెల్ల నిండఁ జెలఁగ న్నిస్సాణరాడ్ధంధనల్
కంగారయ్యె దశాననాదిఖలరక్షశ్రేణి కంఖాణసా
రంగస్యందనరాజశేఖరఘటల్ రంజిల్లె నాకాంగనా
సంగీతక్రియ హెచ్చె, నృత్యకళలన్ సంధిల్లె హర్షస్థితిన్.

69


ఆ.

దానిఁ గాంచి జనకధరణీశకేసరి
చాలహర్షజలధిఁ దేలి తేలి
సీతఁ గేల సంజ్ఞ చేసిన రాక్షసా
రాతిఁ జేర జనియె రహి దనర్చ.

70
  1. కంది నగరాజె (వ్రా)
  2. చెదర్లయ్యె (ము)