పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

బోయర్ యుద్ధం


అలా యోచించడం పిరికి వారి లక్షణం మన నిజాయితీకి కళంకం ఆంగ్లేయులు ఓడిపోతే, తమ గతి ఏమైవుతుందోనని ఒక్క తెల్లవాడైనా యోచిస్తున్నాడా? యుద్దంలోకి దిగిన తరువాత యీ విధంగా ఎవ్వడూ ఆలోచించడు

1899లో యీ విధంగా భారతీయులకు చెప్పాను యీనాడు కూడా ఆ నా మాటల్లో మార్పు అవసరమని నేను భావించడం లేదు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యమంటే నాకు గల మోహం. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్య పౌరులంగా వుంటూ స్వాతంత్ర్యం పొందాలనే నా కోరిక యీనాడూ వుండివుంటే యిప్పుడు కూడా అలాగే చెప్పి వుండే వాణ్ణి నా యీ వాదనకు వ్యతిరేకంగా బ్రిటన్‌లోను, దక్షిణాఫ్రికాలోను జరిగిన విమర్శలను నేను విన్నాను. అయినా నా అభిప్రాయాల్ని మార్చు కోవలసిన అవసరం నాకు కలగలేదు. యీనాటి నా భావాలకు, ఆనాడు దక్షిణాఫ్రికాలో జరిగిన ఆ వ్యవహారానికి ఏమీ సంబంధం లేదు. అయినా రెండు బలవత్తరమైన కారణాల వల్ల యీ విషయం వ్రాశాను. ఈ పుస్తకాన్ని త్వరత్వరగా చదివి ముగించాలని భావించే పాఠకులు ఓపికతో, శ్రద్ధతో చదివి అర్థం చేసుకుంటారనే ఆశ నాకు లేదు. యిట్టి పాఠకులు యీనాటి నా పనులకు, ఆనాటి నా భావాలకు పొంతన కుదుర్చుకోలేరు యిది మొదటి కారణం ఆ నాభావనాసరళి కూడా సత్యం మీదనే ఆధారపడియున్నది. మనస్సు లోపల ఒకటి, బయట మరొకటి వుండకూడదని, లోపల, బయట ఒకే విధంగా వుండి వ్యవహారించాలని, యిది ధార్మిక విధానానికి మొదటి మెట్టేనని, చివరిమెట్టు కాదని, యిట్టి పునాది లేనిదే ధార్మిక జీవన భవన నిర్మాణం చేయడం సాధ్యంకాదని నా నిర్ణయం యిది రెందవ కారణం

ఇక మనం మన చరిత్రవైపుకు మళ్లుదాం

నా వాదన చాలా మందికి నచ్చింది. అయితే యిది నా ఒక్కడి వాదనయేనని పాఠకులు గ్రహించకుందురు గాక. ముందు నుంచే చాలా మంది యీ అభిప్రాయాన్ని ప్రకటించారు. అయితే యింతటి భయంకరమైన యుద్ధ ఫెళఫెళార్పటుల మధ్య భారతీయుల హీనస్వరం ఎవరికి వినపడుతుంది