పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

81


ఆదరించింది యిప్పుడు వాళ్ల యిళ్లు వాకిళ్లు ధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది మనం చేతులు కట్టుకు కూర్చుంటే తమాషా చూస్తూ కూర్చుంటే మన మానవత్వానికే కళంకం యిట్టి ప్రవృత్తి మన కష్టాల్ని యింకా పెంచుతుంది మన మీద వారేమోమో ఆరోపణలు చేస్తున్నారని మనం భావిస్తున్నాం ఆంగ్లేయులు చేస్తున్న ఆరోపణలు తప్పని రుజూ చేసే సదవకాశం యిప్పుడు మనకు లభించింది. మనం యిప్పుడు ఏమీ చేయకపోతే వాళ్ల ఆరోపణలు నిజమేనని మనమే రుజూ చేసినవారమవుతాం తరువాత మన కష్టాలు పెరగవచ్చు. ఆంగ్లేయులు గట్టిగా మనల్ని ఆక్షేపించవచ్చు. మనం బ్రిటిష్ సామ్రాజ్య వాదులకు బానిసలంగా వున్నాము ఆ బానిస శృంఖలాల్ని తెగ గొట్టేందుకు ప్రయత్నిస్తున్నాం భారత దేశనాయకులు కూడా అందుకే కృషి చేస్తున్నారు. బ్రిటిష్ సామ్రాజ్య పౌరులంగా అధికారాలు మనం కోరుతూ వుంటే, యీ యుద్ధ సమయంలో వాళ్లకు సంపూర్తిగా మనం సహకరించడం అవసరం బోయర్లది న్యాయ పక్షమని చాలా వరకు అంగీకరించినా, ఒక రాజ్య వ్యవస్థ ప్రకారం నడుచుకుంటూ, ఆవ్యవస్థను వ్యతిరేకించడం మంచిది కాదు ఆరాజ్యవ్యవస్థ అమలు పరిచే కార్యక్రమాలన్నీ సరియైనవేనని అనడానికి వీలులేదు. అయినా ఏరాజ్యవ్యవస్థలో వుంటామో, ఆ రాజ్యానికి ముప్పు వచ్చినప్పుడు దానికి సాయంచేయడం అవసరం అదీగాక రాజ్యవ్యవస్థ యొక్క కొన్ని చర్యలు ధర్మ బద్ధంకాక పోతే, వారికి పలు విధాల వ్యతిరేకతను తెలియజెప్పాలి మనం భారతీయులం అట్టి పని ఏమీ చేయలేదు. అటువంటి ధర్మ సంకటం యింతవరకు మనకు ఏర్పడ లేదు అందువల్ల మేము యీ యుద్ధంలో సహాయం చేయము అని చెప్పే పరిస్థితి యిప్పుడు లేదు. సామ్రాజ్య పౌరులంగా యీ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి అండగా నిలబడి మనం పని చేయాలి యిది మన కర్తవ్యం యుద్ధంలో ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడతారు అని యోచించవలసిన అవసరం లేదు అలా అనుకోవడం మొదలు పెడితే పాయ్యి నుంచి బయటపడి గాడిపొయ్యిలో పడినట్లవుతుంది. బోయర్లు గెలిస్తే మనల్ని గట్టి దెబ్బతీస్తారని అనుకోవడం కూడా వారికి అన్యాయం చేయడమే. మనకు మనం అన్యాయం చేసుకోవడమే.