పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

బోయర్ యుద్ధం


తగ్గిపోయారు. ఆంగ్లబారిష్టర్లు, వకీళ్లు, వ్యాపారస్తులు అంతా వాలంటీర్లుగా చేరారు. భారతీయుల్ని గురించి ఆంగ్లేయులు ఆక్షేపించడం ప్రారంభించారు "వీళ్లు కేవలం డబ్బుకోసమే వున్నారు. మనకు వాళ్లు బరువు చేటు కర్రకు చెదపట్టిదాన్ని బెండుగా చేసినట్లు యీ భారతీయులు యిక్కడ మనల్ని పట్టి పిప్పిచేస్తున్నారు. మనకు కష్టం వస్తే వీళ్లు పట్టించుకోవడం లేదు. ప్రమాద సమయంలో మనల్ని మనం రక్షించుకోవలసి రాపడమే గాక, యీ భారతీయుల్ని కూడా రక్షించవలసి వస్తున్నది. "యిదీ భారతీయుల్ని గురించి ఆంగ్లేయులు చేసిన తీవ్రమైన ఆరోపణ దీన్ని గురించి భారతీయులు చర్చించాము. యిది సరికాదని నిరూపిద్దామనే నిర్ణయానికి చాలా మందిమివచ్చాము అయితే కొందరు క్రింది అభిప్రాయాల్ని కూడా వెల్లడించారు

ఇంగ్లీషు వాళ్లు, బోయర్లు యిద్దరూ మనల్ని సమానంగా పీడిస్తున్నారు హింసిస్తున్నారు. ఒక్క ట్రాన్స్‌వాల్‌లోనే గాక, నేటాలులోను, కేప్ కాలనీలో కూడా యమయాతనలు పడవలసి వస్తున్నది పరిమాణంలో తేడా తప్ప కష్టాలు అమితంగా పడుతున్నాము మనదిభానిస జాతి అని అంతా భావిస్తున్నారు. బోయర్లవంటి చిన్నజాతి, తమ అస్తిత్వాన్ని రక్షించుకోవడం కోసం బ్రిటిష్ వారితో పోరాడుతున్న విషయం నిజమే యిది తెలిసిన తరువాత కూడా మనం దాని నాశనానికి కారణం కావడం సబబా బోయర్లు యుద్ధంలో ఓడిపోతారని చెప్పలేము వాళ్లు గెలిస్తే మనల్ని వదులుతారా"

ఈ వాదనను సమర్థవంతంగా మా ముందు వుంచగలిగిన దళం ఏర్పడింది. నాకు యీ వాదననచ్చింది. దాన్ని సమర్ధించాలని భావించాసు కాని చివరికి యిది సరికాదనే నిర్ణయానికి వచ్చాను నేను యీ వాదనను వ్యతిరేకించాను

“డక్షిణాఫ్రికాలో మనం బ్రిటిష్ ప్రజలంగా వుంటున్నాము ఏ అర్జీపంపినా అందు బ్రిటిష్ ప్రజలంగా మనల్ని గురించి మనం వ్రాసుకొని అధికారాలు కోరుతున్నాము. బ్రిటిష్ ప్రజలరూపంలో గౌరవం మాకు కలదని ప్రపంచానికి తెలిసేలా చేసుకున్నాము. బ్రిటిష్ ప్రజలంగా భావించి ప్రభుత్వం మనల్ని