పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

భారతీయులు ఏం చేశారు? -3


యిక ఇంగ్లాండులో సాయం కోసం చేసిన కృషిని వివరిస్తాను జాతీయ కాంగ్రెస్ యొక్క బ్రిటిష్ కమిటీలో సంబంధం పెట్టుకోవలసిన అవసరం ఏర్పడింది. అందునిమిత్తం భారతావనికి చెందిన శ్రీ దాదాభాయి నౌరోజీ గారికి, బ్రిటిష్ కమిటీ అధ్యక్షులు సర్ విలియం బెడర్ బర్న్ గారికి జరుగుతున్న ఘట్టాల వివరమంతా వారం వారం వ్రాసి పంపసాగాము అర్జీలు పంపుటకు పోస్టల్ ఖర్చులు పెట్టుటకు కనీసం 10 పౌండ్లు పంపుతూ వుండేవారం.

ఇక్కడ దాదాభాయి నౌరోజీగారిని గురించిన పవిత్ర సంస్మరణను వివరిస్తాను. దాదాభాయిగారు బ్రిటిష్ కమిటీకి అధ్యక్షులు కారు. అయినా ఖర్చుల నిమిత్తం సామ్ము వారికి వంపి, వారి ద్వారా బ్రిటిష్ కమిటీకి పంపే ఏర్పాటు చేయడం మంచిదని భావించాము ఆ విధంగా పంపిన సొమ్ము వాపసు చేసి, యీ సొమ్ము మీరు సర్ విలియం బెడ్ బర్న్ గారికే పంపండని మాకు తెలియజేశారు. వారు మాకు సహాయం చేస్తూ వుండేవారు. కాని బెడ్ బర్న్ గారి ద్వారా పని చేయిస్తే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని వారి అభిప్రాయం అంత పెద్దవారై యుండి కూడా ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో ఎంతో మెలకుప వహించి యుండేవారు వివరాలు వ్రాయడానికి ఏమీ లేకపోతే బాబు అందిందని తెలిపి, ప్రోత్సహిస్తూ ఒక వాక్యం వ్రాసేవారు. అట్టి బాబులు వారే వ్రాసేవారు. ఆ జాబుల వివరం ఇష్యూబుక్కులో వ్రాసివుంచేవారు

మేము మా సంస్థకు కాంగ్రెస్ అని పేరు పెట్టామే కాని మా సమస్యలను మరో పార్టీ సమస్యలుగా చేయడం మా కోరిక కాదని గతంలో పేర్కొన్నాను అందువల్ల దాదాబాయి నౌరోజీ గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లే మిగతా పార్టీల వారితో కూడా జరుపుతూ వున్నాము వారిలో యిద్దరు ప్రముఖులపేర్లు పేర్కొనడం అవసరం ఒకరు సర్ మంచర్జీ భావనగరీ, రెండవ వారు సర్ విలియం విల్సన్ హంటర్ సర్‌మంచర్జీ భావనగరీ అప్పుడు బ్రిటిష్ పార్లమెంటు మెంబరుగా వుండేవారు. వారి వల్ల మాకు మంచి