పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

65


కనుక నేను వారి సలహాప్రకారం ఓడ మీద ఆగిపోయాను. నా పిల్లల్ని, భార్యను డర్భను నందలి ప్రసిద్ద వ్యాపారి, నా మిత్రుడు పారసీరుస్తుంజీ యింటికి పంపించివేశాను యాత్రీకులంతా దిగివెళ్లిపోయారు. అప్పుడు దాదా అబ్దుల్లా వకీలు, నా మిత్రుడు శ్రీ లాటన్ అక్కడకు వచ్చి నన్ను చూచి "ఇదేమిటి? మీరు దిగలేదేమిటి? అని అడిగాడు నేను శ్రీ ఎస్కంబ్ ఒక జాబు ద్వారా పంపిన కబురును గురించి వారికి చెప్పాను మీరు యిలా చీకట్లో దొంగవలె. దోషివలె రహస్యంగా దిగి వెళ్లడం నాకు యిష్టంలేదు మీకు భయంలేకపోతే నాతోబాటురండి ఏమీ జరగనట్లే మనిద్దరం కలిసి కాలి నడకన పట్టణం వెళదాం" అని అన్నాడు. వెంటనే అందుకొని నాకేమీ భయం లేదు. ఎస్కంబ్ యిచ్చిన సలహాను పాటించాలా వద్దా అనే ఆలోచిస్తున్నాను. ఇందు ఓడ కెప్టెస్ యొక్క బాధ్యతను గురించి కూడా యోచిస్తున్నాను అని చెప్పాను శ్రీ లాటిన్ నవ్వుతూ శ్రీ ఎస్కంబ్ మీకు ఒరగపెట్టింది ఏమీ లేదు. అతడిచ్చిన సలహాను పాటించవలసిన అవసరం ఏమీలేదు. అతడిచ్చిన సలహాలో కపటం లేదని నమ్ముటకు మీదగ్గర ఏ ఆధారమూలేదు. అసలు పట్టణంలో జరిగిన దానికి అతడే కారణం యిక్కడ ఏమేమి జరిగిందో మీకంటే నాకు బాగా తెలుసు (నేను మధ్యన తలఊపాను) పోనీ ఎస్కంబ్ యిచ్చిన సలహా మంచికోసమే అని అనుకుందాం దాన్ని పాటించినందున మీప్రతిష్ఠ పెరగదు తరుగుతుంది. భయపడి చీకట్లో దిగిపారిపోయాడని అంతా అంటారు. అందువల్ల మీరు సరే నంటే నాతోపాటు రండి ఓడ దిగి వెళదాం కెప్టెన్ మన మనిషే అందువల్ల ఆయన బాధ్యత మన బాధ్యతయే అతణ్ణి అడిగేదెవరు? దాదాఅబ్దుల్లాయే గదా అబ్దుల్లా సాహసం అద్భుతం అని అన్నాడు లాటన్ పగడీ (తలపాగా) పెట్టుకున్నాను పోదాం. పదండి' అని అన్నాను కెప్టెనుకు చెప్పి యిద్దరం ఓడదిగాం

శ్రీ లాటిన్ డర్భనుకు చెందిన పాత ప్రసిద్ధ వకీలు వారితో నాకు మంచి సబంధం వున్నది. కష్టమైన వ్యాజ్యాలు వస్తేవారి సాయం తీసుకునే