పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

భారతీయులు ఏం చేశారు? -2

అని సమాధానం పంపించారు. అప్పటికి నేటాల్ ప్రభుత్వం కూడా అలసిపోయింది అనుచితము, అన్యాయమూ అయిన ఆంక్షల్ని ఎంతకాలం అమలుచేస్తుంది? 23 రోజులు గడిచాయి. దాదాఅబ్దుల్లా పట్టు వీడలేదు యాత్రీకులు భయపడలేదు. అందువల్ల గతిలేక 23 రోజుల తరువాత ఓడలపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం తొలగించి వేసింది. హార్బరులోనికి ఓడలు ప్రవేశించవచ్చునని అనుమతి లభించింది. ఈ లోపున శ్రీ ఎస్కంబ్ తెల్లవాళ్లను శాంతపరచుటకు ప్రయత్నించాడు "డర్బనులో శ్వేత జాతీయులు చూపించిన ఐకమత్యం అద్భుతంగా పనిచేసింది మీరు చేతనైనంత చేశారు 23 రోజులు భారతీయుల్ని ఓడలు దిగకుండా చేశారు. ఇక శక్తి ప్రదర్శన విరమించడం మంచిది. ఇంగ్లాండునందలి పెద్ద ప్రభుత్వంపై మంచి ప్రభావం పడుతుంది. మీబల ప్రదర్శన వల్ల నేటాల్ ప్రభుత్వం పని తేలిక అయిపోయింది. ఇక మీరు భారతీయ యాత్రీకుల జోలికి పోవద్దు పోతే మాత్రం చేసిందంతా వృధా అవుతుంది నేటాలు ప్రభుత్వం ఇరుకున పడిపోతుంది. యింత చేసినా యాత్రీకుల్ని దిగకుండా మీరు ఆపలేరు భారతీయ యాత్రీకుల్లో చాలామంది పిల్లలు, మహిళలు వాళ్ల జోలికిపోతే ప్రపంచమంతా ఛీకొడుతుంది. భవిష్యత్తులో యిక భారతీయులనెవ్వరినీ దక్షిణాఫ్రికాలోపల అడుగుపెట్టనీయం ఆపని నేటాలుప్రభుత్వం చేస్తుంది మాటయిస్తున్నాను. అసెంబ్లీలో బిల్లుపెట్టి ప్యాసుచేస్తాం" అంటూ శ్రీ ఎస్కంబ్ వాళ్లకు చెప్పాడు. (అతడి మాటల సారాంశం మాత్రమే నేను యిక్కడ వ్రాశాను.) ఎస్కంబ్ ఉపన్యాసం విని శ్వేత జాతీయులు నిరాశ పడిపోయారు. అయినా ఎస్కంబ్ అంటే వున్న గౌరవంతో వాళ్లంతా వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఓడలు హార్బరులోకి ప్రవేశించాయి.

"మీరు పగటిపూట ఓడదిగ వద్దని, సాయంత్రం తరువాత కెప్టెనును పంపుతానని. ఆయన వెంట యింటికి వెళ్లమని" ఎస్కంబ్ నాకు కబురు పంపాడు. నాకుటుంబ సభ్యులు ఎప్పుడైనా దిగవచ్చునని కూడా కబురు వచ్చింది. ఇది అతడి ఆ దేశంకాదు, నాక్షేమం కోరి యిచ్చిన సలహా మాత్రమే వాస్తవానికి నేను ఎప్పుడైనా దిగవచ్చు. అయితే మంచిని కోరిపంపిన కబురు