పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

63


రకరకాలుగా వత్తడి తెచ్చారు. ఆశ కూడా పెట్టారు. తమ మాట వినకపోతే మీవ్యాపారాన్ని ఆపివేస్తామని కూడా భయపెట్టారు. కాని ఆయన పిరికి రకంకాదు. వాళ్లు తెల్లవాళ్లకు స్పష్టంగా చెప్పివేశారు. "మావ్యాపారం పోయినా సరే, నష్టపడిపోయినా సరే తలవంచం చివరి వరకు పోరాడుతాం అంతేగాని ఏదోషం చేసి ఎరుగని యీయాత్రీకుల్ని మాత్రం ఇండియాకు తిరిగి పంపం అట్టి పాపం మేము చేయం మీకు మీదేశంమంటే ఎంత అభిమానమో, మాకు మాదేశమంటే అంతే అభిమానం అనికూడా చెప్పివేశారు ఈ కంపెనీ వకీలు . ఎఫ్. ఏ. లాటస్ కూడా సాహసి యోధుడు

ఇదే సమయంలో అనుకోకుండా కీ. శే. శ్రీ మనసుఖలాల్ హీరాలాల్ నాజర్ (సూరత్ నగకాయస్థులు కీ. శే. శ్రీ నానాభాయి హరిదాస్ మేనల్లుడు) దక్షిణాఫ్రికా వచ్చారు. నేను వారిని ఎరుగను. వారు వచ్చారనికూడా నాకు తెలియదు కుర్లాండు, నాదరీ ఓడల్లో వచ్చిన భారతీయుల్ని నిజంగా,నేను తీసుకోరాలేదని చెప్పనవసరంలేదని భావిస్తున్నాను. వారిలో ఎక్కువ మంది భారతీయులు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న పాతవారే కొంతమంది ట్రాన్స్‌వాల్ వెళ్లవలసినవాళ్లు అంతా యీ ఓడల్లో ఎక్కారు. ఈ ప్రయాణీకులను కూడా బెదిరిస్తూ తెల్లవాళ్ళు వార్తలు పంపారు. కెప్టెస్ వాళ్లు పంపిన హెచ్చరికల్ని యాత్రీకులకు చదివి వినిపించారు. "నేటాల్ యందలి తెల్లవారు ఉగ్రులైయున్నారు. అయినా లెక్కచేయకుండా భారతీయ యాత్రీకులు ఓడలు దిగి హార్బరులో అడుగు పెడితే ఒక్కొక్కణ్ణి విసిరి సముద్రంలో పారేస్తాం" అంటూ తెల్లవాళ్లు పంపిన హెచ్చరికల్లో వ్రాసి వున్నది కుర్లాండులో వున్నయాత్రికులకు ఆహెచ్చరికను నేను అనువదించి చెప్పాను నాదరీ యందుగల యాత్రీకులకు మరొకరెవరో అనువదించి చెప్పారు. అయితే రెండు ఓడలలో వున్న భారతీయ ప్రయాణీకులు తెల్లవాళ్ల యిట్టి హెచ్చరికను ఖాతరు చేయలేదు. “మేము చాలామందిమి ట్రాన్స్‌వాల్ వెళ్లాలి మిగతవారంతా నేటాల్లో చాలాకాలం నుంచి నివసిస్తున్న వారే మాకందరికీ నేటాలు హార్పరులో దిగే అధికారం చట్టరీత్యా వున్నది మీరు బెదిరిస్తున్న తీరును మేము అంగీకరించడం లేదు. మేమంతా యిక్కడ దిగుతాము