పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ప్రస్తావన

దక్షిణాఫ్రికాలో భారతీయుల సత్యాగ్రహం, ఎనిమిది సంవత్సరాల పాటు జరిగింది. సత్యాగ్రహం అనుశబ్ద పరిశోధన ఆసంగ్రామం సాగినప్పుడే జరిగింది. దానికే సత్యాగ్రహ సమరం అని పేరు వచ్చింది. ఆసంగ్రామ చరిత్ర వ్రాయాలని చాలా సంవత్సరాలు అనుకున్నాను. ఆ విషయాలు నేనే వ్రాయగలను ఏకారణంవల్ల ఏ ఘట్టం ఎప్పుడు జరిగిందో నడిపినవాడికే తెలుస్తుంది గదా రాజకీయ రంగంలో యీ ప్రయోగం పెద్దస్థాయిలో దక్షిణాఫ్రికాలో మొదటి పర్యాయం జరిగింది. అందువల్ల ఆ సత్యాగ్రహ సిద్దాంత వికాసాన్ని గురించి ప్రజలు తెలుసుకోవాలి ఏ సమయంలోనై నా యిది అవసరమే

ఇప్పుడు భారతదేశంలో భారతీయుల సత్యాగ్రహ క్షేత్రం విస్తరించింది భారత దేశపు వీరమ్ గ్రామ్‌లో ప్రారంభమైన చిన్న సంగ్రామం గత్యంతరం లేక సత్యాగ్రహ రూపం దాల్చింది

వీరమ్‌గ్రామ్‌లో సాగిన పోరాటానికి కారకుడు ఒక సచ్చరిత్రుడు పరోపకారి యగుదర్జీ మోతీలాల్ 1915లో నేను ఇంగ్లాండు నుంచి కారియావాడ్ (సేరాష్ట్ర) వెళ్లుతున్నాను రైల్లో మూడవ తరగతి పెట్టెలో వున్నాను బడ్వాణ్ స్టేషనులో యితడు తన కొద్దిమంది అనుచరులతో బాటు వచ్చి నన్ను కలిశాడు. వీరమ్‌గ్రామ్‌ని గురించి కొద్దిగా చెప్పి ఇలా అన్నాడు

మీరు యీ కష్టాన్ని తొలగించుటకు ఏమైనా చేయండి. కారియావాడ్‌లో మీరు పుట్టారు. యిక్కడ దీన్ని మీరు సరిజేయండి". అతడి కండ్లలో దృఢత్వం కరుణరసం రెండూ వున్నాయి

“మీరు జైళ్లకు వెళ్లుటకు సిద్ధమేనా?" అని నేను అడిగాను.

“ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధం" అని వెంటనే సమాధానం లభించింది

"మీరు జైలుకు వెళితే చాలు నమ్మకద్రోహం మాత్రం జరగకూడదు'

అని స్పష్టంగా చెప్పాను. "అనుభవం మీద మీకే తెలుస్తుంది " అని అన్నాడు మోతీలాల్

vii