పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

భారతీయులు ఏం చేశారు? -2


పాల్గొన్నారు. ఓడలో వస్తున్న భారతీయులకు వ్యతిరేకంగా ప్రసంగాలు జరిగాయి కుర్లాండు, నాదరీఓడల్లో భారతీయులు నేటాలు తెల్లవాళ్ల మీద దాడి చేయడానికి వస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. 800 మంది భారతీయుల్ని నేను రెండుఓడల్లో నేటాలకు తీసుకువస్తున్నాని నామీద ఆరోపణ చేశారు. నేటాలును స్వతంత్ర భారతీయులతో నింపడానికి నేను చేస్తున్న ప్రధమ ప్రయత్నం యిది అని జనాన్ని రెచ్చకొట్టారు. అసలు మమ్మల్ని నేటాలులో దిగనీయవద్దని ప్రభుత్వమే రెచ్చగొట్టింది. ఈ జనాన్ని వాపసు పంపివేయాలని, అలాపంపకపోతే తెల్లవారే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మమ్మల్ని వెళ్లగొట్టాలని తీర్మానించుకున్నారు. యింతలో రెండు ఓడలు నేటాలు హార్బరుకు చేరాయి

1996లో మొదటిసారి భారతదేశంలో ప్లేగు వ్యాధి వ్యాప్తమైన విషయం పాఠకులకు జ్ఞాపకం వుండే వుంటుంది. నేటాబు ప్రభుత్వం దగ్గర మమ్మల్ని తిరిగి పంపించే అధికారం ఏమీలేదు. అప్పటికి ప్రవేశపత్రాల చట్టం యింకా అమల్లోకి రాలేదు. నేటాలు ప్రభుత్వం అక్కడి తెల్లవారికి బాగా అనుకూలం నేటాలు ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక మంత్రి కీ. శే. శ్రీ ఎస్కంబ్ ఆ కమిటీకి పూర్తి సహాయకారాలు అందిస్తూవున్నాడు. కమిటీని రెచ్చగొట్టేపనికూడా ఆయనే నిర్వహిస్తున్నాడు ఓడల్ని ఒక నిశ్చితమైన వ్యవధివరకు క్వారంటీన్‌లో వుంచుతారు. అంటే ఓడతోగల సంబంధాలన్నీ ఆపివేస్తారన్నమాట యాత్రీకుల్ని, వారి సామానుస ఓడలోనే వుంచివేస్తారు. హార్బరులో దిగనీయరు. ఈ నిర్ణయం హార్బర్‌కు సంబంధించిన ఆరోగ్యాధికారి ఆర్డరు ప్రకారం జరుగుతుంది ఈ అధికారాన్ని నేటాలు ప్రభుత్వం రాజకీయ కారణాలకు పుపయోగించుకున్నది. అంటే అట్టి అధికారాన్ని దుర్వినియోగ పరిచిందన్న మాట ఏ యాత్రీకునికీ ఏ విధమైన జబ్బు లేకపోయినా రెండు ఓడల్నీ 23 రోజులవరకు హార్బరులో ఆపి వుంచారు. ఈ లోగా తెల్లవాళ్ల కమిటీ తన పని సాగించింది. దాదా అబ్దుల్లా కుర్లాండుకు యజమాని నాదరీ ఓడ కూడా వారి ఏజంటుదే ఆయనను తెల్లవాళ్లు బెదిరించారు. భయపెట్టారు. రెండు ఓడల్ని తిరిగి ఇండియాకు పంపించి వేయమని ఆయన పై