పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

61


బాలసుందరం అను గిర్‌మిటీయా కార్మికునిపై అతడి యజమాని చెయ్యిచేసుకున్నాడు. అతడి శరీరానికి చాలా గాయాలయ్యాయి. వాటిని నేను స్వయంగా చూచాను అతడికేసు నాచేతికి వచ్చింది. అతడి కష్టాల్ని గురించి నాకు తెలిసిన సమాచారు ప్రకారం యిక్కడ బాగానే చెప్పాను రూటరు ప్రతినిధి ఆవార్తను తారుమారుచేశాడు. అతడు పంపిన వార్త నేటాలు చేరేసరికి అక్కడ తెల్లవారు నామీద ఉగ్రులైపోయారు. ఈ విషయంలో నేటాల్లో నేను వ్రాసిన వార్తలే భారతదేశంలో కంటే తీవ్రంగా వున్నాయి. నేను భారతదేశంలో ఒక్కఅతిశయోక్తి కూడా చెప్పలేదు సామాన్యంగా మనం ఒక తెలియని వ్యక్తి ఎదుట, కొన్ని వివరాలు చెప్పినప్పుడు అతడు మనం ఉహించినదాని కంటే అధికంగా ఉహించికొంత కల్పించి వ్రాస్తాడు. వాస్తవానికి ఇండియాలో వున్నప్పుడు తగ్గించే అక్కడి వివరాలు చెప్పాను నేటాలులోవున్నప్పుడే కఠినంగా వ్రాశాను నేటాలులో నేను ప్రచురించిన వార్తలు అక్కడి తెల్లవాళ్లు చదివేవారు కాదు. చదివినా లెక్కచేసే వారు కాదు కాని భారతదేశంలో నేను చెప్పినట్లు రాయిటర్ విదేశాలకు పంపబడిన వార్తలకు ఎక్కడలేని ప్రాధాన్యం సంతరించుకున్నది. దానితో నేటాలు యందలి తెల్లవారిని పెద్ద భయం పట్టుకున్నది నా ప్రచారం వల్ల గిర్‌మిటియా కార్మికులు యిక రారని, వచ్చిన వాళ్లుకూడా వుండరని, యిప్పుడు తాముగడిస్తున్న లాభాలు తగ్గిపోతాయని అనుకున్నారు. అంతేగాక భారతదేశంలో నేటాలుకు చెందిన తెల్లవారు అవమానం పాలు అయ్యారని కూడా ఉహించుకున్నారు

నామీద మండిపడిపోయారు యింతలో నేను కుటుంబంతో సహాకుర్లాండు ఓడలో నేటాలుకు, వస్తున్నానని వాళ్లకు సమాచారం అందింది ఆఓడలో 300లేక 400 మంది భారతీయులుకూడా వస్తున్నారని తెలుసుకున్నారు. కుర్లాండు ఓడ వెనక నాదరీ ఓడకూడా వస్తున్నదనీ, అందులో కూడా యింతమందే భారతీయులు వస్తున్నారని వాళ్లకు తెలిసింది. ఈ సమాచారం వల్ల నిప్పులో నెయ్యి పోసినట్లయింది. దానితో ఘరీ పెట్రేగి పోయారు. పెద్ద సభలు చేశారు. పెద్ద పెద్ద తెల్లజాతి వారంతా ఆ సభల్లో