పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

భారతీయులు ఏం చేశారు? -2


అందింది. అక్కడ ఏదో వ్యతిరేకవ్యవహారం జరుగుతున్నదని బోధపడింది దానితో కలకత్తా సభను విరమించుకొని నేటాలుకు బయలుదేరాను బొంబాయి నుంచి బయలుదేరే మొదటి ఓడ మీద నాకుటుంబ సభ్యలతో సహా బయలుదేరాను ఆఓడను దాదా అబ్దుల్లా గారి వ్యాపారసంస్థ వారు కొన్నారు. వారు పలుసాహసకార్యాలు చేశారు అట్టి కార్యాల్లో నేటాలు, పోరుబందరు మధ్య ఓడ నడపడం నిజంగా సాహసకార్యమే ఆ ఓడ పేరు కుర్లాండ్ కుర్లాండుకు టిక్కట్టుకొన్నాను. ఈ ఓడ బయలుదేరిన వెంటనే అదే రోజున పర్షియన్ కంపెనీ వారి ఒక ఓడ నాదరీ కూడా బొంబాయి నుంచి నేటాలుకు బయలుదేరింది. ఈ రెండు ఓడల్లో కలిపి దక్షిణాఫ్రికాకు వెళ్లే వారు సుమారు 800మంది వున్నారు

భారతదేశంలో దక్షిణాఫ్రికా యందలి భారతీయుల స్థితిగతులను గురించి నేను చేసిన ప్రచారం తారస్థాయిని చేరుకున్నది. భారతదేశమందలి పత్రికలన్నీ సంపాదకీయాలు, వ్యాఖ్యలు ప్రచురించాయి రాయిటర్ పంపిన తంతులద్వారా విదేశాలకు చాలా సమాచారం అందింది. ఈ విషయం నేటాలు చేరిన తరువాత నాకు తెలిసింది. విదేశాలకు చేరిన సమాచారాన్ని అందుకొని అక్కడి రూటర్ ప్రతినిధి క్లుప్తంగా ఒక తంతి దక్షిణాఫ్రికా కూడా పంపించాడు ఆ తంతి ద్వారా పంపిన సమాచారంలో నేను చెప్పిన దానికి అతిశయోక్తులు అతడు జోడించాడు. ఇలాంటి అతిశయోక్తులు మనం అప్పుడప్పుడు చూస్తూనే వుంటాం. అయితే కావాలని చేస్తారా అంటే చేయరు. అనేక పనుల్లో మునిగివుండేవారు, తమకు గల ఉద్దేశ్యాలు. భావాలు లోపల పెట్టుకొని, పై పై విషయాన్ని చదివి దానిమీద వార్త వ్రాస్తారు. ఒక్కొక్కప్పుడు అట్టి వార్త వ్రాసిన వాడి ఊహయే గాని అదిసత్యం కాదు ఆవార్తకు వేరు వేరు చోట్ల వేరు వేరు ఆర్థాలు తీస్తారు. ఇదంతా సామాన్యంగా జరుగుతూనే వుంటుంది. ప్రజారంగంలో యిటువంటివి తప్పవు. అయితే వాటికి ఒక హద్దుకూడా వుంటుంది భారత దేశంలో వున్నప్పుడు నేను నేటాలుకు చెందిన తెల్ల వారిని విమర్శించాను. వారిమీద ఆరోపణలు చేశాను. గిర్‌మిటియా కార్మికుల పై విధించబడిన 3 పౌండ్ల తలపన్నును కఠినంగా విమర్శించాను