పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

59


విషయం మాట్లాడండి వారుకూడా నామాదిరిగానే మీకు సలహా యివ్వవచ్చు ప్రొఫెసర్ భండార్‌కరు అధ్యక్షత వహిస్తే యిరుపక్షాలవారు పూనుకొని సభను జయప్రదం చేస్తారు. నాసాయం మీకు పూర్తిగా లభిస్తుంది

లోకమాన్యుని సలహా గైకొని నేను శ్రీ గోఖలేగారిని కలిశాను. మొదటి కలయికలోనే వారు నా హృదయం మీద చెక్కుచెదరని ముద్ర ఎంతగా వేశారో గతంలో వ్రాశాను తెలుసుకోవాలనుకుంటే పాఠకులు యంగ్ ఇండియా లేక నవజీవన్ పాతపత్రికల్ని చదవవచ్చు. లోకమాన్యుని సలహా శ్రీ గోఖలేగారికి కూడా నచ్చింది. వెంటనే నేను భండార్‌కర్‌గారి దగ్గరకు వెళ్ళాను నేటాల్ భారతీయుల పరిస్థితుల్ని గురించి శ్రద్ధగ విని శ్రీ భండార్కర్ "నేను బహిరంగసభలకు వెళ్లను నేను వృద్ధుణ్ణి మీ మాటలు నన్ను అమితంగా ప్రభావితం చేశాయి. అన్ని పక్షాల సహాయం పొందాలని మీరు భావించడం ఎంతో సమంజసం అవసరం కూడా మీరు నవయువకులు భారతదేశపు రాజకీయాలు మీకు తెలియవు అందువల్ల యిరుపక్షాల వారికి చెప్పండి నేను బహిరంగసభకు అధ్యక్షత వహిస్తాను. వారిలో ఎవరైనా సభ జరుగుతుందని నాకు తెలియజేస్తే చాలు. నేను వచ్చి సభకు అధ్యక్షత వహిస్తాను" అని చెప్పారు

పూనాలో సభ జయప్రదంగా జరిగింది. ఇరుపక్షాల నాయకులు అందు. పాల్గొన్నారు. ఇరుపక్షాల నాయకులు సభలో ప్రసంగించారు. ఆ తరువాత నేను మద్రాసు వెళ్లాను. అక్కడనేను జస్టిస్ సుబ్రహ్మణ్య అయ్యర్, శ్రీ పి ఆనందాచార్యులు, హిందూ పత్రిక తాత్కాలిక సంపాదకుడు శ్రీ జి సుబ్రమ్మణ్యం, మద్రాస్ స్టాండర్డ్ సంపాదకుడు శ్రీ పరమేశ్వరన్ పిళ్లె, ప్రసిద్ధ వకీలు శ్రీ భాష్యం అయ్యంగార్, శ్రీ నార్టన్ మొదలగు వారిని కలిశాను అక్కడ కూడా ఒక పెద్ద సభ జరిగింది. మద్రాసు నుంచి నేను కలకత్తా వెళ్లాను అక్కడ నేను శ్రీ సురేంద్రనాథ్ బెనర్జీ, మహారాజా జ్యోతీంద్రనాధ టాగూర్. ఇంగ్లీషుమెన్ సంపాదకుడు కీ. శే. శ్రీసాండర్స్, తదితరులను కలిశాను కలకత్తాలో సభ జరుపుటకు ఏర్పాటు జరుగుతూవున్నాయి. యింతలో నేటాలు నుంచి 1896 నవంబరులో నాకు వెంటనే రండి అని తంతి