పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

భారతీయులు ఏం చేశారు? -2


వున్నది అందరికంటే ముందు నేను తిలక్ మహారాజ్‌ని కలుసుకున్నాను పూనాలో జరుపవలసిన సభను గురించి తిలక్‌గారిని అడిగాను మీరు గోపాల రావును కలిశారా అని వారు నన్ను అడిగారు

మొదటి వారు ఏ గోపాలరావును గురించి అడుగుతున్నారో నాకు అర్ధం కాలేదు. అప్పుడు వారు. శ్రీ గోఖలేను కలిశారా? వారిని ఎరుగుదురా అని అడిగారు

నేను - వారిని యింత వరకు నేను కలవ లేదు. వారి పేరు మాత్రం విన్నాను వారిని కలుసుకుందామని అనుకుంటున్నాను

లోకమాన్యుడు , భారత దేశపు రాజకీయాలు మీకు తెలిసినట్లు లేదు

నేను - ఇంగ్లాండులో చదువు ముగించుకొని భారతావని వచ్చాను కాని యిక్కడ ఎక్కువకాలం వుండలేదు. వున్న కాలంలో కూడా రాజకీయ రంగానికి దూరంగా వున్నాను అది నా శక్తికి మించినపని అని అనుకున్నాను

లోకమాన్యుడు - అయితే నేను కొద్దిగా మీకు చెప్పాలి పూనాలో రెండు పక్షాలు వున్నాయి. ఒకటి సార్వజనిక సభకు సంబంధించినది. రెండవది డక్కన్ సభకు సంబంధించినది

నేను. ఈ విషయం నాకు కొద్దిగా తెలుసు

లోకమాన్యుడు- ఇక్కడ సభజరపడం తేలికయే మీరు పార్టీలన్నిటికి అక్కడి సమస్యలు తెలియజేయాలనీ, అన్నిటి సమర్ధన పొందాలని భావిస్తున్నారు. యిది నాకు నచ్చింది. అయితే సార్వజనిక సభకు చెందిన వ్యక్తి మీ సభకు అధ్యక్షత వహిస్తే డక్కన్ సభకు సంబంధించిన వాళ్లెవ్వరూ రారు డక్కన్ సభకు సంబంధించిన వారెవరైనా అధ్యక్షత వహిస్తే సార్వజనిక సభకు చెందిన వారెవ్వరూ రారు అందువల్ల మీరు తటస్థవ్యక్తిని అధ్యక్షుణ్ణిగా ఎన్నుకోండి ఈ విషయయంలో నేను సలహామాత్రమే యివ్వగలను యింకే సహాయం చేయలేను. మీరు ప్రొఫెసర్ భండార్కరును ఎరుగుదురా? ఎరుగకపోయినా మీరు వారిని కలవండి వారు తటస్థంగా వుండే వ్యక్తి వారు రాజకీయాల జోలికిపోరు. వారిని కలిస్తే, వారినే మీ సభకు అధ్యక్షులుగా వుంచాలని మీరు అనుకుంటారు. శ్రీ గోఖలేతో కూడా యీ