పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

57


నిజాయతీ, శాంతి, ఓర్పు, దృఢత్వం. సమయపాలన, సాహసం, వ్యావహారిక జ్ఞానం, అవసరం ఎంత విద్వత్తు వున్నా మిగతా విశేషాలు లేకపోతే ప్రయోజనం వుండదు. ఇది స్వానుభవం వల్ల నేను తెలుసుకున్న విషయం

1896 మధ్య కాలంలో నేను భారతావనికి వచ్చాను. నేను కలకత్తా చేరాను. ఆ రోజుల్లో నేటాలునుంచి ఓడద్వారా కలకత్తా చేరడం సులభం గిర్‌మిటియా కార్మికులు కలకత్తా నుంచో లేక మద్రాసునుంచో నేటాలు చేరేవారు కలకత్తా నుంచి బొంబాయివస్తూ త్రోవలో రైలు తప్పిపోయినందున, ఒక్క రోజు అలహాబాదులో ఆగవలసి వచ్చింది. అక్కడినుంచే నా పనిని ప్రారంభించాను పయోనీర్ పత్రికకు సంబంధించిన శ్రీ చేజనీని కలుసుకున్నాను ఆయన నాతో ఎంతో సుహృద్భావంతో మాట్లాడారు. అధినివేశ రాజ్యాల్లో వుంటున్న తెల్లవారి యెడ తనకు సానుభూతి కలదని ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే అక్కడి పరిస్థితుల్ని గురించి వ్రాసి యిస్తే పయోనీర్ పత్రికలో ప్రచురించి, దానితో పాటు తన అభిప్రాయంను ప్రకటిస్తానని మాట యిచ్చాడు. దానికి నేను తృప్తి పడ్డాను

భారత దేశంలో వున్నప్పుడు నేను దక్షిణాఫ్రికాలో వుంటున్న భారతీయుల పరిస్థితులను గురించి ఒక చిన్న పుస్తకం వ్రాశాను ఆ పుస్తకం మీద దేశంలో గల భారతీయ పత్రికలన్నీ సంపాదకీయాలు వ్రాశాయి. రెండు సార్లు ఆ పుస్తకం ముద్రించ వలసివచ్చింది అయిదు వేల ప్రతులు నేను విడుదల చేశాను. అనేక మంది దేశ నాయకుల్ని కలుసుకున్నాను బొంబాయిలో సర్‌ఫిరోజ్ షా మెహతా, న్యాయమూర్తి బదరుద్దీన్ తయాబ్జీ, మహాదేవ గోవిందరానడే మొదలగువారిని, పూనాలో లోకమాన్య బాలగంగాధరతిలక్, వారికి సంబంధించిన పెద్దల్ని ప్రొఫెసర్ భండార్కర్, గోపాలకృష్ణ గోఖలే, వారికి సంబంధించిన పెద్దల్ని కలుసుకున్నాను బొంబాయి, పూనా, మద్రాసుల్లో నేను ఉపన్యాసాలు, యిచ్చాను. వాటన్నిటి వివరాల్లోకి నేను పోదలచలేదు

అయితే పూనాలో జరిగిన ఒక ఘట్టం పేర్కొనక తప్పదు. దానికి మన సమస్యకు సంబంధం లేదు. ఇక్కడ బహిరంగ సభ, లోకమాన్య తిలక్‌గారి సలహా ప్రకారం జరిగింది. కీ. శే. గోఖలేగారికి దక్కన్ సభతో సంబంధం