పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi


ప్రోత్సహిస్తారని విశ్వసిస్తున్నాము ఈ అయిదు సంపుటాలను తెలుగులో ప్రచురించుటకు అయ్యే ఆర్థిక వ్యయాన్ని పూర్తిగా నవజీవన ట్రస్టు, అహమదాబాద్ భరిస్తున్నది. ట్రస్టుకు సంబంధించిన యితర శాఖల ఆదాయాన్ని యీ ప్రణాళికకు వినియోగించి తక్కువ ధరకు యీ సంపుటాల సెట్టును తెలుగు ప్రజలకు అందజేస్తున్నాము యీ ప్రణాళికను తెలుగులో అమలు బరచుటకు శ్రీ బిరిధీ చంద్ చౌదరి, శ్రీ వేమూరి రాధాకృష్ణ మూర్తీ గారలు సంపూర్తిగా సహకరించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అనువాదం, టైపుసెట్టింగ్, ఫ్రూపురీడింగ్, కెమెరా ప్రతులు తయారు చేయించుకృషికి శ్రీ బిరిధీచంద్ చౌధరి సహకరించారు. యీ సంపుటముల తెలుగు సేతతో బాటు, ఇతర పెద్దలు చేసిన తెలుగు అనువాదాన్ని, మరియు ప్రూపుల్ని సరిచూచి శ్రీ వేమూరి రాధాకృష్ణమూర్తి సహకరించారు

ఎంపిక చేసిన మహాత్మాగాంధీ రచనల అయిదు సంపుటముల సెట్టు ప్రచురణకు సంబంధించిన మా యీ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించి ప్రోత్సహిస్తారని విశ్వసిస్తున్నాము

ది 28-10-98

అహమదాబాద్

జితేంద్ర టి. దేశాయి

మేనేజింగ్ ట్రస్టీ