పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

భారతీయులు ఏం చేశారు? -1

నేను నేటాల్ సుప్రీంకోర్టులో వకాల్తా సనదుపుచ్చుకొనుటకై అర్జీ దాఖలు చేశాను నేటాల్ లాసొసైటి అంటే వకీళ్ల సంఘం నా అర్జీని వ్యతిరేకించింది నేటాలు చట్ట ప్రకారం నల్లరంగు గోధుమరంగు గల వాళ్లెవ్వరికీ వకీలు సనదు ఎట్టి పరిస్థితుల్లోను యివ్వడానికి వీలు లేదని వారు వాదించారు నా అర్జీని నేటాల్ యందలి ప్రసిద్ధ వకీలు కీ. శే. శ్రీ ఎస్కంబ్ సమర్థించారు వారు అటార్నీ జనరల్ తరువాత నేటాలుకు ప్రధాన మంత్రిగా కూడా పని చేశారు. వకీళ్ల సంఘాసికి చెందిన ఏ బారిష్టరూ, ఫీజు తీసుకోకుండా వకీలు సనదు కోసం దాఖలు చేసుకునేవారి అర్జీని సమర్థించకూడదని అక్కడి రివాజు శ్రీ ఎస్కంబ్ దాదా అబ్దుల్లా గారి వకీలు కూడా వకీళ్ల సంఘంచేసిన వాదనను సీనియర్ కోర్టు నిరాకరించి నా అర్జీని అంగీకరించింది. యీ విధంగా వకీళ్ల సంఘం నా ఆర్జీని తీవ్రంగా వ్యతిరేకించడం, వాళ్ల అంగీకారం లేకుండానే నా అర్జీకి అంగీకారం లభించడం వల్ల నా పేరు అక్కడి పత్రికల్లో ప్రముఖంగా చోటు చేసుకుంది నాకు మంచి ప్రచారం లభించింది దక్షిణాఫ్రికాకు చెందిన పలుపత్రికలు నేటాలు వకీళ్ల సంఘాన్ని ఎగతాళి చేశాయి. కొన్ని పత్రికలు నాకు అభినందనలు తెలిపాయి

సేర్ అబ్దుల్లా హాజీఆదమ్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీకి స్థిరరూపం యివ్వబడింది నేను అప్పటి వరకు భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన ఏ సమావేశంలోను పాల్గొన లేదు. కాని దాన్ని గురించి చాలా విన్నాను హింద్‌దాదా (తాత) దాదాభాయీనౌరోజీ గారి దర్శనం నేను చేసుకున్నాను నేను వారిని పూజించేవాణ్ణి అందువల్ల భారత జాతీయ కాంగ్రెసుకు నేను భక్తుణ్ణి అయిపోయాను యీ కాంగ్రెస్ పేరును ప్రచలితం చేయాలనే కోరిక కూడా నాకు కలిగింది. నావంటి అనుభవంలేని వ్యక్తి క్రొత్త పేరు ఎక్కడి నుంచి తేగలడు? తప్పు జరుగుతుందేమోననే భయం కూడా నన్ను వెంటాడుతున్నది. అందువల్ల అక్కడి కమిటీ వారికి "వేటాల్ ఇండియన్ కాంగ్రెస్" అని పేరు పెట్టమని సలహా యిచ్చాను. భారత జాతీయ కాంగ్రెస్‌ను గురించిన నా అసంపూర్ణ జ్ఞానాన్ని, నేను అసంపూర్ణంగానే నేటాల్ యందలి భారతీయులకు అందజేశాను. చివరికి 1894 మే లేక జూన్