పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

51


విజయవంతం అయ్యేవరకు వుండమని నన్ను వత్తిడి చేయసాగారు. నేటాలు ప్రభుత్వం భారతీయుల్ని వెళ్లగొట్టడానికి పూనుకున్నది మనం పంపిన మంత్రి ఏం సమాధానం పంపుతాడో ఎవరి కెరుక? మా ఉత్సాహం చూచారు కదా పని చేయడానికి మేము సిద్ధంగా వున్నాము. కాని మాకు మార్గదర్శకుడు కావాలి. లేకపోతే చేసిందంతా వ్యర్థమైపోతుంది. అందువల్ల యిక్కడ వుండటం మీ ధర్మం అని వాళ్లు స్పష్టంగా చెప్పారు. భారతీయుల హక్కుల రక్షణకై అక్కడ స్థిరంగా ఒక సంస్థ అవసరమని అందుకు నేను వుండటం అవసరమని నాకూ అనిపించింది. కాని ఎక్కడ వుండాలి, ఎలా వుండాలి అనునది నాకు సమస్యగా మారింది. జీతం యిస్తామని వాళ్లు అన్నారు కాని నేను జీతం తీసుకొని పని చేయనని స్పష్టంగా చెప్పివేశాను ప్రజాసేవా కార్యక్రమాలు జీతాలు తీసుకొని చేయకూడదని నా నిశ్చితాభిప్రాయం అందులో యీ ఉద్యమానికి పునాది వేసింది నేను ఆ రోజుల్లో భారతీయుల గౌరవమర్యాదలు యినుమడించేలా నేను దర్జాగా వుండాలని భావించేవాణ్ణి అయితే అలా వుండాలంటే బాగా డబ్బు కావాలి భారతీయులకు మేలు కలిగించు సంస్థలో పని చేయడం, ప్రజలపై వత్తిడి తెచ్చి వాళ్ల దగ్గర దబ్బు వసూలు చేయడం, రెండో వైపున జీవన భృతి కోసం వాళ్ల మీద ఆధారపడటం యీ రెండూ పొసగని విషయాలు యిలా చేస్తే పని చేసే నాశక్తి కూడా తగ్గిపోతుంది. యీ కారణంవల్ల, మరికొన్ని కారణాల వల్ల ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించుటకు జీవన భృతికై ఎవ్వరి దగ్గర జీతం రూపంలోనైనాసరే డబ్బు తీసుకోను అని చెప్పి వేశాను. అయితే ఒక మార్గం వారికి చెప్పాను. “మీలో కొందరు ప్రముఖ వ్యాపారస్తులు మీవకాల్తా పనిని నాకు అప్పగించండి అందుకు అడ్వాన్సుగా (వకీలు ఫీజు) డబ్బు యివ్వండి అలా అయితేనేను యిక్కడ వుంటాను మీరు ఒక సంవత్సరానికి యివ్వవలసిన ఫీజును ముందుగా యివ్వండి ఒక సంవత్సరం యిలా పని చేద్దాం. తరువాత జరిగిన పనుల్ని గురించి యోచిద్దాం సరీగా వున్నదనుకుంటే ఆ తరువాత కూడా యిలాగే చేద్దాం " అని చెప్పాను నేనిచ్చిన సలహాను సంతోషంగా అందరూ అంగీకరించారు