పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

43


కేవలం ఉదాహరణకు మాత్రమే వారి పేర్లు వాళ్ల ప్రఖ్యాతిని గురించి పేర్కొన్నాను. మిగతా మూడు రాజ్యాలకంటే కేప్ కాలనీలో రంగుద్వేషం, మరియు భారతీయుల యెడ వ్యతిరేకత తీవ్రంగా లేకపోయినప్పటికీ, మిగతా ప్రాంతాల ప్రభావం పడకుండా వుండటం సాధ్యం కాదుగదా | అందువల్ల అక్కడ కూడా నేటాలు వలెనే భారతీయుల ప్రవేశం, వ్యాపారం మీద ఆంక్షలు విధిస్తూ ఇమిగ్రేషన్ రెస్ట్రిక్షన్ ఆక్టు, మరియు డీలర్స్ లైసెన్సు ఆక్టు ప్యాసయ్యాయి

మొత్తం మీద దక్షిణాఫ్రికాలో భారతీయుల కోసం తెరిచియున్న ద్వారాలు బోయర్ యుద్ధం నాటికి పూర్తిగా మూసుకున్నాయని చెప్పవచ్చు ట్రాన్స్‌వాల్‌లో భారతీయుల ప్రవేశం పై విధించబడిన 3 పౌన్ల ఫీజు తప్ప మరే ఆంక్షలేదు కాని నేటాలు, కేప్ కాలనీల హార్బర్లు భారతీయులకు ప్రవేశాన్ని నిషేధించాయి యిక ట్రాన్స్‌వాల్ చేరాలంటే భారతదేశాన్నుంచి వెళ్లే భారతీయులు ఎక్కడా దిగడానికి వీలులేదు. ఒక్కమార్గం వున్నది. పోర్చుగీసు వారి హార్బరు డేలాగోవావేలో దిగి ట్రాన్స్‌వాల్ చేరవచ్చు. అయితే అక్కడ కూడా తెల్లవారి రాజ్యాల వలెనే కొద్దో గొప్పో భారతీయులకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించబడ్డాయి. యీ పరిస్థితుల్లో కొద్ది మంది భారతీయులు మాత్రమే పలుకష్టాలు సహించి, లంచాలు యిచ్చి నేటాలు. మరియు డేలో గోవావే, హార్బర్లలో దిగి ట్రాన్స్‌వాల్‌కు చేరుతూవుండేవారు




6

భారతీయులు ఏం చేశారు? -1

గత ప్రకరణాల్లో తమ మీద జరుగుతున్న దాడులను ఎదుర్కొంటూ భారతీయులు గైకొన్న చర్యలను గురించి కొంత తెలుసుకున్నాము అయితే సత్యాగ్రహప్రారంభాన్ని గురించి బాగా తెలుసుకొనుటకు, భారతీయుల రక్షణ కోసం చేసిన ప్రయత్నాలను గురించి వ్రాయడం అవసరమని భావిస్తున్నాను.

1893 వరకు దక్షిణాఫ్రికాలో స్వతంత్ర భారతీయుల్లో భారతదేశప్రజల హితాన్ని రక్షించగల చదువుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా వున్నది