పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకాశకుల విజ్ఞప్తి

మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంలో వారు స్థాపించిన నవజీవన ట్రస్టు పక్షాన వారి ఆత్మకధను భారతీయ భాషలన్నిటిలోను ప్రచురించాలని నిర్ణయించాం ఆ ప్రకారం శ్రీ వేమూరి రాధాకృష్ణమూర్తి తెలుగులోనికి అనువదించిన మహాత్ముని ఆత్మకథను ప్రచురించాం. తెలుగు ప్రజలు మా యీ కృషిని అభినందించారు. ఇప్పటికి 40000 ప్రతులు కొని చదివి మమ్ము పోత్సహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ న్యాయ నిర్ణేతలు మహాత్ముని ఆత్మకధ తెలుగు సేతను 1995 వ సంవత్సరం ఉత్తమ తెలుగు అనువాదంగా నిర్ణయించి 5000/- రూపాయల పురస్కారం యిచ్చి శ్రీ రాధాకృష్ణమూర్తిని సత్కరించడం ముదావహం గాంధీజీ ఆత్మకధను భారతీయ భాషలన్నింటిలోను ప్రచురించాం

మహాత్ముని ఆత్మ కధ యెడ భారత దేశ ప్రజల ఆదరాభిమానాలు చూచి నవజీవన ట్రస్టు మరో ప్రణాళికను చేపట్టింది. మహాత్ముడు రచించిన రచనల్లో నుంచి విషయాన్ని బట్టి కొన్నింటిని ఎంపిక చేసి సంపుటముల సెట్టు రూపంలో ప్రచురించి, తక్కువ ధరకు దేశ ప్రజలకు అందజేయాలనునదే ఆ ప్రణాళిక ప్రప్రధమంగా ఇంగ్లీషు భాషలో నవజీవన ట్రస్టు పక్షాన ఎంపిక చేసిన మహ్మాత్మాగాంధీ రచనలను ఆరు సంపుటముల సెట్టుగా ప్రచురించాము ఆ గ్రంధాలు అపరిమితంగా ప్రజల ఆదరణను చూరగొనడం వల్ల పెద్ద సంఖ్యలో అనేక సార్లు ప్రచురించి ప్రజానీకానికి అందించాము భారతీయ భాషల్లో కూడా యీ ప్రణాళికను అమలు బరచుటకు నిర్ణయించి గత సంవత్సరం మళయాళం భాషలో అయిదు సంపుటముల సెట్టుగా ప్రచురించి కేరళ ప్రదేశ్ ప్రజల మన్ననలు పొందామని తెలుపుటకు సంతోషిస్తున్నాము.

ఇప్పుడు తెలుగులో 5 సంపుటాల సెట్టును నవజీవన ట్రస్టు పక్షాన సబ్సిడీ రేటుకు ప్రచురిస్తున్నాము. మహాత్మాగాంధీ సిద్ధాంతాల యెడ మక్కువ చూపే తెలుగు ప్రజలు మా యీ కృషిని అభినందించి

v