పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

కష్టాల సింహావలోకనం 2


తరువాత మంత్రి మండలిలో ప్రధానమంత్రిగా కూడా పని చేశారు ప్రసిద్ధికెక్కిన ప్రతిభావంతురాలగు వారి సోదరి ఆఁలిప్ శ్రాయినర్ దక్షిణాఫ్రికాలో అమితంగా ప్రజాదరణ పొందిన మహిళ ఇంగ్లీషు మాట్లాడబడే ప్రాంతాలన్నిటి యందు ఆమె విదుషీమణిగా ప్రఖ్యాతి గడించింది. మనుష్యుల యెడ అమెకు గల ప్రేము అపారం ఎప్పుడు చూచినా ఆమె కండ్ల నుంచి ప్రేమ వర్షిస్తూ వుంటుంది. ఆమె డ్రీమ్స్ అను పుస్తకం వ్రాసింది. అప్పటినుంచి అమె డ్రీమ్స్ రచయిత్రిగా పేరుపొందింది. ఆమె నిరాండబరత్వం అమోఘం ఇంట్లో గిన్నెలు సైతం ఆమెయే తోముకుంటుంది అది ఆమె గొప్పతనం ఈ మూడు కుటుంబాల వారు మొదటి నుంచి హబ్షీల పక్షం వహించారు తెల్లవాళ్లు హబ్షీల అధికారాల్ని తగ్గించుటకు ప్రయత్నించినప్పుడు యీ ముగ్గురు ప్రముఖులు ఆ ప్రయత్నాలను వ్యతిరేకించారు. వాళ్ల యీ ప్రేమ భారతీయులపైకి కూడా మళ్ళింది. అయితే ఆ ముగ్గురూ హబ్షీలు భారతీయులు యిరువురి మధ్య తేడాను పాటించే వారు. వాళ్ల తర్కం ఒక్కటి ఇంగ్లీషు వాళ్లు రాక పూర్వమే యిక్కడ నివసించిన వాళ్లు హబ్షీలు వారు యిక్కడి మూలవాసులని అందువల్ల తెల్లవాళ్లు హబ్షీల సహజ హక్కుల్ని హరించుటకు వీలు లేదు. భారతీయుల విషయంలో పోటీ పడతారనే భావంతో వారికి వ్యతిరేకంగా చేయబడుతున్న నిర్ణయాలలో సారళ్యం రావాలి అది న్యాయ సమ్మతం అని వారి అభిప్రాయం అయినా వారు భారతీయుల యెడ ఎంతో సానుభూతిగా వున్నారు. శ్రీగోపాలకృష్ణ గోఖలే మొదటిసారి దక్షిణ ఆఫ్రికా విచ్చేసినప్పుడు వారి సమ్మానార్ధం మొదటి సభ కేప్ టౌన్‌యందలి టౌన్‌హాలులో జరిగింది. దానికి శ్రీ శాయినర్ అధ్యక్షత వహించారు. శ్రీ మేరిమెన్‌కూడా గోఖలే గారితో తీయగా ప్రేమగా మాట్లాడారు. భారతీయుల ఎడ తమ సానుభూతిని ప్రకటించారు. కేప్ టౌస్ నుంచి వెలువడే పత్రికలు కూడా యితర రాజ్యా ల పత్రికల కంటే పక్షపాత రహితంగా వుంటాయి. అవి భారతీయులకు పూర్తి వ్యతిరేకం కాదు

శ్రీ మేరిమెన్, శ్రీ కశాయినర్‌గారలను గురించి నేను పైన వ్రాసినట్లు యింకా అనేక మంది ఆంగ్లేయుల్ని గురించి వ్రాయవచ్చు. యిక్కడ నేను