పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

41


మహమ్మదీయులతో వారికి త్వరగా మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. భారతీయ మహమ్మదీయుల ద్వారా, మిగతా భారతీయుల సంబంధం కూడా మలై వాసులతో మెరుగుపడిందని చెప్పవచ్చు. భారతీయ మహమ్మదీయులు చాలా మంది మలై ముస్లింస్త్రీలతో వివాహ సంబంధాలు పెట్టుకున్నారు మలై ప్రజలకు వ్యతిరేకంగా కేప్ కాలనీ ప్రభుత్వం చర్యలు తీసుకునే స్థితిలో లేనేలేదు. కేప్ కాలనీ వాళ్లకు అది జన్మభూమి వాళ్లది డచ్‌భాష, డచ్‌వాళ్లతో మొదటి నుంచి కలిసి మెలిసి వుండటం వల్ల మలై ప్రజలు చాలా వరకు డచ్ ప్రజలను అనుసరించారు. అందువల్ల అక్కడ రంగు భేదం అతి తక్కువగా వున్నది

కేప్ కాలనీ అత్యంత ప్రాచీన అధినివేశ రాజ్యం దక్షిణాఫ్రికాకు చెందిన శిక్షణా సాంస్కృతిక కేంద్రం కూడా అందువల్ల ఉదార హృదయులు, వినయ సంపన్నులు, విద్యావంతులు అయిన ఆంగ్లేయులు అక్కడ జన్మించారు ప్రపంచంలో ఏమారుమూలనైనా సరే అనుకూల వాతావరణం వుండి, మంచి శిక్షణకు సంస్కారాల బోధనకు అవకాశం ఏర్పడితే అక్కడి వారు అత్యుత్తమమైన మానవ లక్షణాలు కలిగి వుంటారనీ ఎంతో అందమైన మానవ పుష్పాలు వికసించి తీరుతాయని నా ప్రగాఢ విశ్వాసం అదృష్టవశాత్తు దక్షిణాఫ్రికా యందలి పలుచోట్ల నేను అట్టి ఉత్తమ మానవుల్ని దర్శించాను. అయితే కేప్ కాలనీలో యిట్టివారి సంఖ్య అధికంగా వున్నది వారిలో గొప్ప ప్రసిద్ధులు శ్రీ మేరిమెన్ వారంటే అక్కడి జనానికి అమిత గౌరవం 1872లో కప్ కొలనీలో జవాబుదారీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుంచి వారు మంత్రివర్గ సభ్యుడుగా వున్నారు. 1910లో దక్షిణాఫ్రికా యూనియన్ ఏర్పడినప్పుడు వారి దాని చివరి మంత్రివర్గానికి ప్రధాన మంత్రిగా వున్నారు. సంపూర్ణ శ్రాయినర్ కుటుంబం, మరియు మోల్టినో కుటుంబమని అక్కడి రెండుకుటుంబాల వారు వున్నారు. యీ రెండు కుటుంబాలు శ్రీ మేరిమెన్ స్థాయిలో కాకపోయినా, రెండో స్థానంలో వున్నాయి. సర్‌జాన్ మోల్టినో 1872లో ప్రథమ మంత్రిమండలికి ప్రధానమంత్రిగా పని చేశారు. శ్రీ డబ్ల్యు. పి. శ్రాయినర్ ప్రసిద్ధ అడ్వొకేట్. కొంతకాలం పాటువారు అటార్నీ జనరల్ గా వున్నారు