పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

కష్టాల సింహావలోకనం 1


ముక్తులై వేరే వృత్తులు ప్రారంభించారు. దీనివల్ల నేటాలు ప్రజలకు ప్రయోజనమే కలిగింది. మంచి రైతులు లేనందున గతంలో అందని కూరగాయలు జనానికి బాగా అందసాగాయి. అందువల్ల కూరగాయల ధరలు బాగా తగ్గిపోయాయి. ఈ వ్యవహారం డబ్బుగలతెల్ల దొరలకు నచ్చలేదు. తమ ఒక్కరి పెత్తనమే సాగుతున్నదనుకున్న చోట మరొకరు ప్రవేశించేసరికి తెల్లవాళ్లు మండిపడ్డారు దానితో యిట్టి గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయులకు వ్యతిరేకంగా నేటాలులో ఒక ఉద్యమం ప్రారంభమైంది పాఠకులు గమనించవలసిన విషయం ఒకటున్నది. తెల్లవాళ్లు బానిసలుగా పనిచేయుటకు భారతీయ కార్మికులు కావాలని ఒక వైపున కోరుతూ, గిర్‌మిట్ ప్రధనుంచి విముక్తి పొందిన భారతీయులపై ఆంక్షలు విధించాలని మరొకవైపున ఉద్యమం సాగించారు. భారతదేశం నుంచి వచ్చే గిర్‌మిటియాలంతా నేటాలుకే సరిపోతూ వుండేవారు తెలివిగల భారతీయులు చేసిన కాయకష్టానికి తెల్లవాళ్లవల్ల లభించిన ప్రతిఫలం యిదే

ఆ ఉద్యమం అనేక రూపాలు దాల్చింది. తెల్లవాళ్లు క్రొత్తపాట మొదలుపెట్టారు. వాళ్లకు కావలసింది భారతీయగిర్‌మిటియాలు వాళ్లు స్వతంత్రులు కావడం తెల్లవాళ్లకు యిష్టం లేదు. కావున క్రొత్త వాదన ప్రారంభించారు. భారతదేశాన్నుంచి గిర్‌మిటియాలు నేటాలులో గడువుతీరిన తరువాత స్వతంత్రులుగా వుండకూడదని, వాళ్లు భారతదేశం తిరిగి వెళ్లిపోవాలని, నేటాలులో వుండదలుచుకుంటే తిరిగి గిర్‌మిటియాలుగానే వుండాలని అట్టి నిబంధనలు క్రొత్త ఎగ్రిమెంట్లో చేర్చాలనే ప్రచారం ప్రారంభించారు. ఏది ఏమైనాగిర్‌మిటియా ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయులు స్వతంత్రంగా నేటలులో వుండకూడదు. ఇదీ వాళ్ల వాదన ఇందుకోసం ఉద్రిక్తంగా ఉద్యమం నడిపించారు. చివరికినేటాలు ప్రభుత్వం దీనిమీద ఒక కమిషన్‌ను నియమించింది. రెండువర్గాలవారి వాదనలు సరిగా లేవు అసలు గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయుల పల్ల నేటాల్ ప్రజలకు మేలు జరిగింది. అందువల్ల కమిషన్ ముందు సాక్ష్యాలు యిచ్చినవారంతా రెండు వర్గాల తెల్లవాళ్లకు వ్యతిరేకంగా వాజ్మూలం యిచ్చారు. చివరకు తెల్లవాళ్ల