పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

29


వాళ్లు భారతీయవ్యాపారులతో వ్యాపారం సాగించుటకు వారికి యిబ్బంది ఏమీ లేదని భారతీయులు తెలుసుకున్నారు. దానితోకొంత మంది భారతీయవ్యాయపారులు ట్రాన్స్‌వాల్, ఫ్రీస్టేట్‌లకు ప్రాకారు అక్కడ దుకాణాలు తెరిచారు. అప్పుడు అక్కడ రైలు ప్రయాణసౌకర్యం లేదు. అందువల్ల వ్యాపారంలో లాభాలు బాగా గడించవచ్చన్న భారతీయుల ఆలోచనలు సత్యమని తేలాయి బోయర్లు, హబ్షీలు వారి దగ్గర వస్తువులు విపరీతంగా కొనడం ప్రారంభించారు. యిక మిగిలింది ఒక్క కేప్‌కాలనీ మాత్రమే అక్కడికి కూడా కొందరు భారతీయ వ్యాపారులు చేరారు. సంపాదన బాగా రాసాగింది యీ విధంగా కొద్ది సంఖ్యలోనైనా సరే భారతీయులు దక్షిణాఫ్రికా యొక్క నాలుగు రాజ్యాలలో ప్రవేశించారు

అప్పుడు పూర్ణ స్వతంత్రులైన భారతీయుల సంఖ్య 40 మరియు 50వేల మధ్య, గిర్‌మిట్ ముక్త భారతీయుల సంఖ్య, వాళ్ల సంతతితో కలుపుకొని ఒక లక్ష వరకు ఉన్నది




4

కష్టాల సింహావలోకనం -1

నేటాలు

నేటాలునందలి తెల్లదొరలకు బానిసలు అవసరమైనారు. గిర్‌మిట్ గడువుపూర్తికాగానే స్వతంత్రులయ్యేవాళ్లు, ఏ విధంగానైనా తమతో సమంగా వుండగలిగినవాళ్లు తెల్లవారికి అక్కరలేదు. భారతదేశంలో వ్యవసాయం సరిగ్గాసాగక, రాబడి బాలక చాలామంది భారతీయులు గిర్‌మిట్లుగా నేటాల్ వెళ్లారు. అయితే వాళ్లకు వ్యవసాయం అంటే ఏమిటో, పొలం అంటే ఏమిటో బాగా తెలుసు నేటాలువచ్చి అక్కడిభూములు చూచిన తరువాత కాయకూరలు పండించుకొని ఎంతో ధనం సంపాదించుకోవచ్చునని వాళ్లు గ్రహించారు. ఏ కొంచెం పొలం సంపాదించుకున్నా బాగా పంటలు పండించుకోవచ్చని తెలుసుకున్నారు. అందువల్ల చాలామంది గిర్‌మిటియాలు గడువు తీరిపోగానే