పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

దక్షిణాఫ్రికాకు భారతీయులరాక


వ్యాపారులంటే హబ్షీలు భయపడుతూ వుండేవారు. ఇంగ్లీషు వ్యాపారులు హబ్షీలతో వ్యాపారు సాగించాలని భావించేవారే, కాని హబ్షీలతో మంచిగా మాట్లాడటం వారికి సాధ్యపడలేదు. హబ్షీలు వెళ్లి ఆంగ్లవ్యాపారులకు సొమ్ము చెల్లించి అందుకు రావలసిన వస్తువులు పూర్తిగా పొందలేక పాయేవారు. అలాలభిస్తే గొప్ప అదృష్టంగా భావించేవారు. ఉదాహరణకు ఒక హబ్షీ గ్రాహకుడు నాలుగు షిల్లింగుల ధరలుగల వస్తువుకోసం ఒక్కపౌండు యిస్తే మిగతా పదహారు షిల్లింగులు తిరిగి యివ్యకుండా తెల్లవ్యాపారి నాలుగు పిల్లింగులే యిస్తాడు. ఒక్కొక్కప్పుడు అవికూడా యివ్వడు. మిగిలిన డబ్బులు యిమ్మని అడిగితే తిట్లు వినపలసి వచ్చేది అప్పుడప్పుడు తన్నులు తినవలసివచ్చేది. తెల్లవ్యాపారులంతా హబ్షీలతో యిలా వ్యవహరించేవారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు కాని యిలాంటి ఉదాహరణలు విపరీతంగా వుండేవి భారతీయ వ్యాపారితియ్యగా మాట్లాడటమె కాక, హబ్షీలతో సర్దాగా కూడా మాట్లాడుతూ వుండేవాడు. హబ్షీలు అమాయకులు దుకాణానికి వచ్చి వస్తువుల్ని చేతితో తాకి చూస్తూవుండేవారు. భారతీయ వ్యాపారి యిదంతా సహించేవాడు. అతడు పారమార్ధిక భావంతోకాక, స్వార్ధంతోనే అలా చేసేవాడు. అవకాశం చిక్కితే భారతీయ వ్యాపారి హబ్షీవాళ్లను మోసం చేయడానికి వెనుకాడేవాడు కాడు. అయినా హబ్షీవాళ్లు భారతీయ వ్యాపారులదగ్గరకు వాళ్లమాటల యందలి తీయదనంవల్ల ఆకర్షితులై వెళ్లుతూవుండేవారు. అంతేగాక హబ్షీలు భారతీయులంటే భయపడేవారుకాదు అప్పుడప్పుడు భారతీయ వ్యాపారులు తమను మోసగించారని తెలిస్తే హబ్షీవాళ్లు తిన్నగా వచ్చి తమను మోసం చేసినవాళ్లను తన్నేవారు వాళ్ల చేత తిట్లు కూడా భారతీయ వ్యాపారులు తినేవాళ్లు యీ విధంగా హబ్షీలంటే భారతీయులే భయపడుతూవుండేవారు. దానితో హబ్షీలవల్ల భారతీయుల వ్యాపారం బాగా పెరిగిపోయింది. హబ్షీలు దక్షిణాఫ్రికా యందంతట వ్యాప్తమై యుండటం అక్కడి విశేషం

ట్రాన్స్‌వాల్ మరియు ఫ్రీస్టేట్‌లో బోయర్లతో కూడా వ్యాపారం చేయవచ్చని భారతీయలు గ్రహించారు. బోయర్లు అమాయకులు, మంచి