పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

27


కాకతప్పలేదు. ఆచట్టనిబంధనలు అంతకఠినంగా వుండటమే అందుకు కారణం బానిసత్వపు మచ్చబానిసల సంతానానికి సైతం అంటకుండా ఎలా పుంటుంది? యీ విధంగా అక్కడికి వెళ్లే భారతీయ కార్మికులు అయిదు సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకొని నేటాలు వెళ్లేవారు అయిదు సంవత్సరాలు గడిచాక వారు స్వతంత్రులే అప్పుడు వారు స్వతంత్రంగా బ్రతకవచ్చు. వ్యాపారం గాని, వృత్తిగాని చేసుకోవచ్చు. అక్కడ వుండాలని ఆనుకుంటే వుండవచ్చు. కొందరు ఆ అధికారాన్ని ఉపయోగించుకొని అక్కడవుండి పోయారు. కొందరు భారతావనికి తిరిగి వచ్చివేశారు. ఆ విధంగా నేటాల్లో వుండిపోయిన భారతీయుల్ని ఫ్రీ ఇండియన్స్ అని అనేవారు. నేను వారిని గిర్‌మిట్ ముక్తులు లేకముక్తి పొందిన భారతీయులు అని అంటాను యీ బేధాన్ని తెలుసుకోవడం చాలా అవసరం యిక్కడే మెలికవున్నది పూర్తి స్వతంత్రులైన భారతీయులకు గల అధికారాలకు, గిర్‌మిట్ ప్రధ నుంచి ముక్తులైన భారతీయులకు లేవు ఉదాహరణకు యిట్టివారు. ఒక చోటు నుంచి మరో చోటుకి నివాసం మార్చదలుచుకుంటే అందుకు ఆర్డరు తీసుకోవాలి యిదీ నియమం వాళ్లు వివాహం చేసుకోవచ్చు. అయితే చట్టరీత్యా వివాహం చెల్లుతుందని ధృవీకరింపచేసుకోవడానికి, వారు గిర్‌మిటియాల రక్షణ కోసం నియమింపబడిన అధికారి కార్యాలయానికి వెళ్ళి సమోదు చేయించుకోవాలి యిదే కాక యిటు వంటి కఠోరమైన అంకుశాలు వాళ్ల మీద చాలా వుండేవి

1980-1990లో ట్రాన్సవాల్ మరియు ఫ్రీస్టేటు నందు బోయర్ల ప్రజాతంత్ర రాజ్యాలు వున్నాయి. ప్రజాతంత్ర రాజ్యమంటే ఏమిటో యిక్కడ చెప్పడం అవసరం యిక్కడ ప్రజాతంత్ర రాజ్యం అంటే తెల్ల ప్రజాతంత్రాధిక్యత కలిగిన రాజ్యం అని అర్ధం హబ్షీ వాళ్లకు దానితో సంబంధమేమీ లేదు

భారతీయ వ్యాపారులు తాము కేవలం గిర్‌మిట్ భారతీయులతోనేగాక హబ్షీలతో కూడా వ్యాపారాలు చేయవచ్చునని గ్రహించారు. భారతీయ వ్యాపారులు హబ్షీలకు బాగా అందుబాటులో వుండేవారు. ఇంగ్లీషు