పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

దక్షిణాఫ్రికాకు భారతీయులరాక


భారత దేశాన్నుంచి గిర్‌మిటియాలు నేటాలు చేరారనే వార్తలు మారిషస్ దేశం చేరాయి. అట్టి భారతీయులతో సంబంధాలు గల భారత వ్యాపారులు నేటాలు వెళ్లుటకు ఉవ్విళ్లూరారు మారిషస్ దేశం భారత దేశానికి దక్షిణాఫ్రికాకు మధ్యన వున్నది. మారిషస్ ద్వీపంలో వేలాదిమంది భారతవ్యాపారులు. కార్మికులు ఉంటున్నారు. వారిలో ఒక వ్యాపారి పేరు కీ. శే. అబూబకర్ అమద్ అతడు నేటాలులో తనవృత్తి ప్రారంభించాలని భావించాడు. భారత వ్యాపారులు ఏమేమి చేయగల శక్తివంతులో ఇంగ్లీషు వాళ్లకు తెలియదు వాళ్లంటే లెక్కకూడాలేదు. భారతీయ కార్మికుల సహాయంతో ఆంగ్లేయులు నేటాలులో చెరుకు, తేయాకు, కాఫీ బాగా పండించడమేగాక బాగాలాభాలు గడించసాగారు. కొద్ది సమయంలోనే యీ వస్తువుల్ని దక్షిణాఫ్రికా కంతటికీ సప్లై చేయసాగారు బాగా ధనం సంపాదించి త్వరత్వరగా విశాలమైన భవనాలు నిర్మాణం చేసుకున్నారు. అడవిలో వైకుంఠాన్ని స్థాపించారు. అట్టి వాతావరణంలో సేఠ్ అబూబకర్ వంటి సామాన్యుడు, నమ్మకస్తుడు, తెలివిగల వ్యాపారి తమ మధ్య నివసించడం వారికి యిష్టం కాలేదు ఒక ఇంగ్లీషు వాడు కూడా భాగస్వామిగా ఆబూబకర్‌తో కలిసి వ్యాపారం చేయసాగారు సేఠ్ అబూబకర్ వ్యాపారం ప్రారంభించి పొలం కొన్నాడు. అతడు బాగా డబ్బు సంపాదించాడనే వార్తలు భారత దేశం ముఖ్యంగా అతని జన్మస్థలి యగు గుజరాత్ యందలి పోర్‌బందర్ వంటి చోట్లకు చేరాయి. దానితో యితరమహమ్మదీయులు కూడా నేటాలు చేరారు. వారితోబాటు సూరత్‌కు చెందిన బాహరాలు కూడా అక్కడికి చేరారు యీ వ్యాపారులకు గుమాస్తాలు అవసరమైనారు. దానితో గుజరాత్, కారియావాడ్ (సౌరాష్ట్ర) కు చెందిన హిందూ గుమాస్తాలు కూడా నేటాలు చేరుకున్నారు

ఈ విధంగా నేటాలులో రెండురకాల భారతీయులు చేరారు. 1 స్వతంత్ర వ్యాపారులు, వారి స్వతంత్ర నౌకర్లు 2 భారతీయ గిర్‌మిటియాలు. త్వరలోనే గిర్‌మిటియాలకు పిల్ల పాపలు పుట్టారు. గిర్‌మిట్ విధానం ప్రకారం అట్టి సంతతిపై బానిసత్వపు చట్టం అమలు కాక పోయినా, ఆచరలో అమలు