పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

దక్షిణాఫ్రికాకు భారతీయులరాక


ప్రారంభించారు. భారత ప్రభుత్వం అందుకు అనుకూలంగా స్పందించింది తత్పలితంగా ది 16 నవంబరు 1860 నాడు భారతీయ కార్మికుల మొదటి జట్టు ఓడ ద్వారా నేటాలు చేరుకున్నది

దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో యీ తేదీకి ప్రముఖ స్థానం లబించింది ఆ తేదీ నాడు ఆ ఘట్టం జరిగి యుండక పోతే భారతీయులు దక్షిణాఫ్రికాలో ఆడుగు పెట్టేవారు కాదు. సత్యాగ్రహ సమరం జరిగి యుండేది కాదు యీ దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర వ్రాయవలసిన అవసరం ఏర్పడి యుండేది కాదు

నేటాల్‌లో నివసించే ఆంగ్లేయుల కోరికను అంగీకరించినప్పుడు భారత ప్రభుత్వం యీ విషయాన్ని నిశితంగా పరిశీలించలేదని నా అభిప్రాయం భారత దేశంలో పరిపాలన సాగిస్తున్న కొందరు ఆంగ్లేయులు నేటాలులో నివసిస్తున్న తమ ఆంగ్లేయుల పక్షం వహించారు. అయితే కాగితాల మీద జరిగిన ఒప్పందంలో భారత దేశకార్మికుల రక్షణను గురించి షరతులు ఎక్కువగా చేర్చడమే గాక, వారి ఆహార పానీయాల విషయంలో కూడా ఎక్కువ షరతులు చేర్చడం జరిగిన మాట వాస్తవమే అయితే యింత దూరాన్నుంచి అక్కడికి వెళ్ళిన భారతీయులపై కష్టాలు, ఆపదలు, చిక్కులు విరుచుకు పడితే వాటి పరిష్కారం ఎలా చేయాలి అనువిషయాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. భారతీయుల మత రక్షణ ఎలా జరుగుతుందో, వారు తమ రీతుల్ని నీతుల్ని ఎలా రక్షించుకోగలలో కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. చట్ట రీత్యా బానిస వృత్తి రద్దయిందేగాని, యజమానుల హృదయాలనుంచి ఆ ప్రవృత్తి తొలగలేదను విషయం కూడా భారత ప్రభుత్వంలో వున్న ఆంగ్ల అధికారులు పట్టించుకోలేదు. అక్షరం జ్ఞానంలేని భారతీయ కార్మికులు అమితదూరాన వున్న పరాయి దేశానికి వెళ్లి నిర్దారించబడిన గడువు దాకా బానిసలైపోతారను విషయం వాళ్ళు గమనించలేదు. సర్ విలియం విల్సన్ హంటర్ అను మహాశయుడు యీ కార్మికులు స్థితిగతులను గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అక్కడి వారి పరిస్థితిని గురించి వర్ణిస్తూ, రెండు శబ్దాల్ని లేక రెండు శబ్దాల