పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

377


గురించి చర్చించుటకు బహిరంగ సభమ ఏర్పాటు చేశాడు. కాని బొంబాయి ప్రభుత్వం ఆ సభను జరుగనీయలేదు. యీ సభ 13 రోజుల తరువాత జరిగింది.

16. సెప్టెంబరు . ఇంగ్లాండులో ట్రాన్స్‌వాల్ భారతీయ ప్రతినిధి బృందం లార్డ్ క్రూని కలుసుకున్నది

13. నవంబరు ఇంగ్లాండు వెళ్లిన భారతీయుల ప్రతినిధి బృందం కిల్డోనవ్ కేసిల్ అను ఓడలో దక్షిణాఫ్రికాకు ప్రయాణమైంది.

1 డిసెంబరు . భారత దేశంలో శ్రీ రతన్ తాతా దక్షిణాదఫ్రికా సత్యాగ్రహుల సహాయార్థం 25 వేల రూపాయల విరాళం ప్రకటించారు.

1910

25. ఫిబ్రవరి భారత దేశపు కేంద్ర పార్లమెంటులో గోఖలే గారు ప్రవేశపెట్టిన గిర్‌మిట్ ప్రధరద్దు తీర్మానం ప్యాసైంది.

1. జూన్ దక్షిణాఫ్రికా యూనియన్‌గా రూపొందింది. అదే రోజున శ్రీ సారాబ్జీ షాపుర్జీ అడాజడియా ఏడోసారి అరెస్టు అయ్యారు.

4 జూన్ - శ్రీ కెలన్ బెక్ లాలేలో గల తన ఫారమును సత్యాగ్రహులు నివసించుటకు యిచ్చి వేశాడు.

13. జూన్ - 26 మంది సత్యాగ్రహలు ప్రెసిడెంట్ స్టీమరులో దక్షిణాఫ్రికా వచ్చారు

26. జూలై - పోర్చుగ్రీజు ప్రభుత్వ సహాయంతో భారతీయుల్ని దేశాన్నుంచి బహిష్కరించారు. దీనికి వ్యతిరేకంగా లార్డ్స్ సభలో లార్డ్ ఎంప్ట్‌హిల్ సుదీర్ఘ చర్చకాచించారు

30, జూలై - ఇవాళటి వరకు మైనరు తీరిన భారతీయబాలురు పేరు వ్రాయించుకొని పత్రాలు పొందవలసినవారికి కూడా పత్రాలు యివ్వడానికి నిరాకరించారు.

22. ఆగష్టు - చోటా భాయీ బిడ్డడి ప్రసిద్ధ టెస్ట్ కేసు జోహాన్స్‌బర్గు కోర్టులో ప్రారంభమైంది. ఆ కేసులో చివరికి చోటాభాయి విజయం సాధించాడు.