పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/391

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
372
అనుబంధం - 1


అనుబంధం - 1

సత్యాగ్రహసంగ్రామ చరిత్రయందు జరిగిన ఘట్టాలు, తేదీలు

(గాంధీగారు. 1893 ఏప్రిల్ నెలలో 24 సంవత్సరాల వయస్సులో భారతదేశాన్నుంచి బయలు దేరి మేమాసంలో డర్బన్ చేరారు.)

1906

4. ఆగస్టు : శ్రీడంకన్, ట్రాన్స్‌వాల్ లేజిస్లేటివ్ కౌన్సిలు నందు ఏషియాటిక్ ఎమెండ్ మెంటు ఆక్టును ప్రవేశ పెట్టాడు.

11 సెప్టెంబరు : జోహన్స్‌బర్గు నందలి ఎంపైర్ ధియేటరులో భారతీయుల బహిరంగ సభ జరిగింది. సభలో పాల్గొన్న ప్రతి భారతీయుడు, ఖూనీ చట్టం ముందుతల వంచకూడదనీ, దాన్ని వ్యతిరేకించి జైలుకు వెళ్లాలని ఒట్టు పెట్టుకున్నాడు. భారతీయుల ప్రతినిధి బృందాన్ని ఇంగ్లాండు పంపాలని తీర్మానించారు.

12. సెప్టెంబరు . ఖూనీ చట్టం ట్రాన్స్‌వాల్ విధాన సభలో అంగీకరించబడింది.

1. అక్టోబరు - భారతీయుల ప్రతినిధి బృందం జోహన్స్ బర్గు నుంచి బయలు దేరింది.

8. నవంబరు ప్రతినిధి బృందం అధినివేశరాజ్య మంత్రి లార్డ్ ఎల్గిన్‌ను కలిసింది.

29. నవంబరు . లండనులో సౌత్ ఆఫ్రికాబ్రిటిష్ ఇండియన్ కమీటీ స్థాపించబడింది. సర్ లెసెల్ గ్రిపిన్ దానికి ప్రథమ అధ్యక్షులుగాను, శ్రీ రిచ్ దానికి కార్యదర్శిగాను నియమింపబడ్డారు.

1. డిసెంబరు : ప్రతినిధి బృందం ఇంగ్లాండు నుంచి దక్షిణాఫ్రికాకు తిరిగి ప్రయాణమైంది.

3. డిసెంబరు : ఖూనీ చటాన్ని బ్రిటిష్ చక్రవర్తి నిరాకరించాడు.

1907

22. మార్చి : బ్రిటిష్ సామ్రాజ్యచక్రవర్తి నిరాకరించిన ఖూనీ చట్టాన్ని ట్రాన్స్‌వాల్ నందలి నూతన పార్లమెంటు 24 గంటల్లో ప్యాసు చేసింది.