పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/389

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
370
ముగింపు


51

ముగింపు

ఈ విధంగా ఎనిమిది సంవత్సరాల తరువాత సత్యాగ్రహ సంగ్రామం ముగిసింది. దక్షిణాఫ్రికా యందు నివసిస్తున్న భారతీయులందరికి శాంతి లభించిందని అంతా అంగీకరించారు. 1914 జూలై 18వ తేదీన దుఃఖం, సంతోషం రెండూ హృదయంలో నింపుకొని నేను ఇంగ్లాండులో గోఖలే గారిని కలిసి భారత దేశం వెళ్లుటకు దక్షిణాఫ్రికా నుంచి బయలు దేరాను. దక్షిణాఫ్రికాలో 21సంవత్సరాలు గడిపాను. లెక్కలేనన్ని చేదు, తీయని ఆమభవాలు పొందాను. నా జీవవ లక్ష్యమేమిటో అర్థం చేసుకున్నాను ఆ దేశాన్ని వదలాలంటే అమిత బాధ ఆపారమైన దుఃఖం కలిగాయి.

సత్యాగ్రహసంగ్రామం దక్షిణాఫ్రికాలో విజయవంతంగా ముగిసింది. అక్కడి భారతీయుల యీనాటి పరిస్థితిని పరిశీలించి చూస్తే వాళ్లు యిన్ని కష్టాలు ఎందుకు పడ్డారను ప్రశ్న మనస్సులో బయలు దేరుతుంది. లేక మానవ జూతి సమస్యల్ని పరిష్కరించుటకు సత్యాగ్రహమను ఆయుధం ఉత్తమ పద్దతిన ఎలా విజయం సాధించింది అను ప్రశ్న బయలు దేరుతుంది. యీ ప్రశ్నకు వచ్చే, సమాధానాన్ని గురించి మనం యోచిద్దాం. సృష్టి నియమం ఒకటి వున్నది. ఏ సాధనంవల్ల ఏ వస్తువు లభిస్తుందో, ఆ సాధనం వల్లనే ఆ వస్తువు రక్షణ పొందుతుందనే నియమం అది. హింసవల్ల లభ్యమయ్యే వస్తువుకు హింస ద్వారానే రక్షణ. కలుగుతుంది. సత్యంవల్ల లభ్యమయ్యే వస్తువుకు సత్యం వల్లనే రక్షణ కలుగుతుంది. యి పద్దతిన దక్షిణాఫ్రికా యందలి భారతీయులు యిప్పుడుకూడా సత్యాగ్రహమనే ఆయుధాన్ని ఉపయోగించితే వారు అక్కడ సురక్షితంగా వుండగలుగుతారు. సత్యం వల్ల లభించిన వస్తువును అసత్యం ద్వారా రక్షించుదామని అనుకుంటే సత్యాగ్రహంలో అందుకు తావు వుండదు. ఒక వేళ అలా సాధ్యపడితే అది వాంఛనీయం కాదు. యీనాడు దక్షిణాఫ్రికాయందలి భారతీయుల స్థితి