పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/378

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
359
సత్యాగ్రహ చరిత్ర


48

ప్రాధమిక ఒడంబడిక

ఈ విధంగా ఒడంబడికకు అనుకూల వాతావరణం నెలకొంటూవున్నది నేను, శ్రీ అండ్రూస్ యిద్దరం ప్రిటోరియా వెళ్లాం లార్డ్ హార్డింగ్ ప్రత్యేక ఓడలో పంపిన సర్ బెంజమన్ రాబర్ట్‌సన్ అప్పుడే దక్షిణాఫ్రికాకు చేరుకోనున్నారు అయితే జనరల్ స్మట్సు రమ్మన్న తేదీకి మేము ప్రిటోరియా చేరాము సర్‌రాబర్ట్‌సన్‌కోసం మేము ఆగ వలసిన అవసరం లేదు. భారత జాతి చేసిన త్యాగాలకు శుభ పరిణామం కలుగక తప్పని స్థితి ఏర్పడింది

మేమిద్దరం ప్రిటోరియా చేరాం అయితే జనరల్ స్మట్సును నేను ఒక్కణ్ణే కలవాలి. ఆ మహాశయుడు రైల్వేలో పనిచేసే తెల్లజాతీయుల సమ్మె వ్యవహారంలో మునిగి వున్నాడు ఆ సమ్మె భయంకర రూపందాల్చింది. దాన్ని అణచుటకు మార్షల్‌లా అమలు చేయవలసి వచ్చింది. జీతాలు పెంచేలా చేసుకోడం సమ్మె చేస్తున్న వారి లక్ష్యం కాదని, అసలు యూనియన్ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవడం వారి ధ్యేయమని తేలింది

జనరల్ స్మట్సును కొద్ది సేపు మాత్రమే మొదటి సారికలిశాను. అప్పుడు జాగ్రత్తగా పరిశీలించి చూచాను. మాయాత్రాదళం బయలు దేరినప్పటి జనరల్ స్మట్సు స్థితి యందు ఎంతో మార్పు కనబడింది. అప్పుడు జనరల్ స్మట్సు నాతో మాట్లాడుటకు నిరాకరించిన విషయం పాఠకులకు తెలుసు. సత్యాగ్రహం అనే బెదిరింపు ఆనాడూ పున్నది, యీనాడూ వున్నది. అయితే ఆనాడు నిరాకరించాడు. యీనాడు అంగీకరించాడు. మీరు వేసే కమీషన్‌లో ఒక భారతీయుడు వుండి తీరాలని సత్యాగ్రహ సమితి కోరుతున్నది అని చెప్పాను కాని అందుకు జనరల్ స్మట్స్ అంగీకరించలేదు. "కమీషన్ సభ్యులను యిక పెంచడానికి వీలులేదు. అలా చేస్తే ప్రభుత్వం యొక్క గౌరవం తగ్గుతుంది. అలా చేస్తే నేను కోరుతున్న సంస్కరణలు చేయలేను. శ్రీ ఎస్లన్ మామనిషి. సంస్కరణలను అతడు వ్యతిరేకించలేదు. ప్రభుత్వానికి ఆనుకూలంగా వుంటారు. కర్నల్ వైలీ నేటాలుకు చెందిన ప్రసిద్ధ వ్యక్తి.