పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/376

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
357
సత్యాగ్రహ చరిత్ర


వినమ్ర నిర్ణయం. మా ప్రతిజ్ఞా పాలనకు మీ సహాయాన్నీ, మీ ఆశీర్వాదాల్ని అభ్యర్థిస్తున్నాం."

ఈ తంతి శ్రీ గోఖలే గారికి అందింది. దాని ప్రభావం వారి ఆరోగ్యం మీద చెడ్డగా పడింది. కాని మాకు వారి వల్ల లభించే సహాయావికి అది అడ్డంకి కాలేదు. సరికదా వారి సహాయం యింకా గట్టిపడి పెద్ద స్థాయిలో లభించసాగింది. వారు లార్డ్ హార్డింగుకు యీ విషయం తంతి ద్వారా తెలియజేశారు. మమ్మల్ని మాత్రం వదిలి వేయలేదు. మా నిర్ణయాన్ని శ్రీ గోఖలే గారు లార్డ్ హార్డింగ్ ఎదుట గట్టిగా బలపరిచారు. లార్డ్ హార్డింగ్ కూడా తమ మాట మీద నిలబడి వున్నారు

నేను అండ్రూసు వెంట ప్రిటోరియా వెళ్లాను అప్పుడే యూనియన్ రైల్వే విభాగంలో శ్వేత జాతీయులైన కర్మచారులంతా కలిసి పెద్ద సమ్మె చేశారు. ఆ సమ్మె వల్ల యూనియన్ ప్రభుత్వం స్థితి బలహీన పడింది. యిట్టి సమయంలోనే భారతీయులు యాత్ర ప్రారంభించాలని చాలా మంది నాకు సలహా యిచ్చారు. కాని నేను సమ్మె చేస్తున్న శ్వేత జాతీయులకు యీ విధంగా సహాయం చేయలేనని ప్రకటించాను. ప్రభుత్వాన్ని యిరకాటంలో పెట్టడం మా లక్ష్యంకాదని, మా సంగ్రామం శ్వేత జాతీయులపోరాటం వంటిది కాదని, అందుకు భిన్నమైనదని, మేము శ్వేత జాతీయుల సమ్మె జరుగుతున్నప్పుడు యాత్ర ప్రారంభించక, వారి సమ్మె ముగిసిన తరువాత ప్రారంభిస్తామని ప్రకటించాను. మా యీ నిర్ణయం వల్ల మంచి ప్రభావం ప్రజాహృదయాలపై పడింది. రాయిటర్ ద్వారా నా యీ ప్రకటన ఇంగ్లాండు చేరింది. లార్డ్ ఎంప్ట్ హిల్ మాకు ధన్యవాదాలు చెబుతూ ఇంగ్లాండు నుంచి తంతి పంపించారు. దక్షిణాఫ్రికా యందలి ఆంగ్ల మిత్రులు కూడా ధన్యవాదాలు అందజేశారు. జనరల్ స్మట్సు గారి ఒక కార్యదర్శి హాస్యభాషలో ఏమండోయ్! నాకు మీ వ్యవహారం నచ్చడం లేదు. నేను మీ వారికి ఏమి సహాయం చేయదలచలేదు. అయినా మీతో ఎలా వేగడం? ఆరే! ఆపద సమయంలో మీరు ఆదుకుంటున్నారు. మిమ్మల్ని ఎలా చంపడం? మీరు కూడా యీ ఆంగ్ల నమ్మె దారుల్లా రగడ చేయమని కోరుతున్నాను. అలా